RC16 అనౌన్స్ అయి ఏడాది
మామూలుగా ఏదైనా సినిమా అనౌన్స్ చేశాక ఏడాది లేదంటే రెండేళ్ల లోపు ఫినిష్ చేస్తేనే ఆ మూవీ మీద ఆడియన్స్ అంచనాలను క్రమం తప్పకుండా పెంచొచ్చు. అలా కాకుండా రీజన్స్ ఏవైనా సరే సినిమా లేట్ చేస్తూ పోతే ఫ్యాన్స్ లోనే హైప్ తగ్గి, సినిమాపై ఇంట్రెస్ట్ పోతుంది. ఈ సమస్య చాలా సినిమాలకుంటుంది.
అయితే సరిగ్గా ఏడాది క్రితం రామ్ చరణ్ 16వ సినిమా గురించి అఫీషియల్ అనౌన్స్ మెంట్ వచ్చింది. ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ పాన్ ఇండియా మూవీ గురించి తర్వాత ఎలాంటి అప్డేట్ లేదు. గేమ్ ఛేంజర్ వల్ల ఈ సినిమాకు లేటవుతూ వస్తోంది. చరణ్ ఇప్పటికీ గేమ్ ఛేంజర్ షూటింగ్ తోనే బిజీగా ఉన్నాడు.
గేమ్ ఛేంజర్ పూర్తయితే తప్ప చరణ్ తన తర్వాతి సినిమా గెటప్లోకి రాలేడు. పైగా ఆ సినిమా కోసం చరణ్ స్పెషల్ గా మేకోవర్ చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి గేమ్ ఛేంజర్ కంప్లీట్ చేసే ఈ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లాల్సి ఉంది. కేవలం సెట్స్ పైకి వెళ్లడానికి ఈ సినిమా ఏడాదికి పైగా టైమ్ పట్టిందంటే ఇక సినిమా పూర్తవడానికి ఎంత టైమ్ పడుతుందో అని ఫ్యాన్స్ అనుకుంటున్నారు.













