Rashmika Mandanna: ఇతరుల కోసం జీవించకూడదు

రష్మిక మందన్నా(rashmika mandanna) ఈ మధ్య పలు విషయాల వల్ల వార్తల్లో నిలుస్తుంది. వరుస సినిమాలతో బిజీగా ఉన్న రష్మిక నుంచి ఇప్పుడు తక్కువ గ్యాప్ లోనే రెండు సినిమాలు రిలీజ్ కానున్నాయి. అందులో ఒకటి బాలీవుడ్ మూవీ థామా(thama) కాగా, రెండోది తెలుగులో రష్మిక చేస్తున్న ది గర్ల్‌ఫ్రెండ్(The Girlfriend). థామా సినిమా అక్టోబర్ 21న రిలీజ్ కానుండగా, ది గర్ల్‌ఫ్రెండ్ నవంబర్ 7న రిలీజ్ కానుంది.
థామా ప్రమోషన్స్ లో భాగంగా రష్మిక ఓ ఇంటర్వ్యూలో గత కొంతకాలంగా తనపై వస్తున్న పుకార్లపై స్పందించింది. రక్షిత్ శెట్టి(rakshith Shetty)తో విడిపోయాక రష్మికను కన్నడ ఇండస్ట్రీ బ్యాన్ చేసిందని వార్తలొస్తుండగా, వాటిపై అమ్మడు క్లారిటీ ఇచ్చింది. తనను ఏ ఇండస్ట్రీ బ్యాన్ చేయలేదని, కొన్నిసార్లు అపార్థాల వల్ల ఇలాంటి పుకార్లు పుట్టుకొస్తాయని రష్మిక చెప్పింది.
ఇతరుల కోసం మనం బతకకూడదని, మన పని మనం చేసుకుంటూ ముందుకెళ్లాలని రష్మిక అభిప్రాయపడింది. కాంతార మూవీ విషయంలో కూడా రష్మిక రెస్పాండ్ అవలేదని ఆమెపై విమర్శలు రాగా, ఏ సినిమా అయినా తాను వెంటనే చూడలేనని, రిలీజైన కొన్నాళ్ల తర్వాత కాంతార(kanthara) చూసి చిత్ర యూనిట్ కు మెసెజ్ చేసి అభినందించానని, దానికి వాళ్లు కూడా థ్యాంక్స్ చెప్పారని, అన్నీ విషయాలు కెమెరా ముందుకు తీసుకురాలేమని, జనాలు ఏమనుకుంటారో తాను పట్టించుకోనని, తన యాక్టింగ్ విషయంలో ఆడియన్స్ ఏమనుకుంటున్నారనేది మాత్రమే తాను పట్టించుకుంటానని రష్మిక చెప్పుకొచ్చింది.