అల్లు అర్జున్, బొమ్మరిల్లు భాస్కర్ కాంబినేషన్ మళ్ళీ రిపీట్ అవుతుందా ?
చేస్తాడనే చెప్పొచ్చు అఖిల్ మూవీ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గనక హిట్టయితే… సినిమా ఇండస్ట్రీలో అవకాశాలు రావడం అనేది చాలా అరుదు. ఇక దర్శకుడిగా క్లిక్కయితే ఆ క్రేజ్ సినిమా సినిమాకు పెరుగుతూనే ఉంటుంది. దాన్ని నిలబెట్టుకోవడం ఒకానొక దశలో చాలా కష్టంగా మారుతుంది. ఇక అలాంటి సమస్యలు ఎదుర్కొన్న దర్శకులల్లో బొమ్మరిల్లు భాస్కర్ ఒకరు. మొదటి సినిమాతోనే తన ఇంటి పేరు బొమ్మరిల్లు గా మార్చుకున్న తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న ఈ దర్శకుడు ఇప్పుడు మళ్ళి సక్సెస్ ట్రాక్ లోకి రావడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాడు. సినిమా జీవితంలో బ్రేక్ రావడానికి ఒకే ఒక్క సినిమా చాలు. అదే విధంగా కెరీర్ ని ఒక్కసారిగా కిందకు తోసేయ్యడానికి కూడా ఒక్క సినిమానే కారణమవుతుంది. భాస్కర్ కి బొమ్మరిల్లు లైఫ్ ఇస్తే.. మంచి సక్సెస్ లో వున్నా అల్లు అర్జున్ తో పరుగు చేసాడు ఆ మూవీ ఆశించినంతగా ఆడలేదు. మగధీర తరువాత రాంచరణ్ కాంబినేషన్ లో హై ఎక్సపెక్టషన్ తో ఆరెంజ్ సినిమా విడుదల అయ్యింది కానీ బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టడంతో భాస్కర్ కి మూడో సినిమా గా చేసిన ఒంగోలు గిత్త కూడా ఊహించని బాడ్ రిజల్ట్ ని వచ్చింది. దీంతో తమిళ్ సినీ రంగం లోకి వెళ్లి బెంగళూరు నాటికల్ అనే తమిళ్ సినిమా చేసాడు అక్కడ రాణించలేదు. దాంతో కొన్నేళ్ల వరకు భాస్కర్ బయటకు రాలేని పరిస్థితి ఏర్పడింది.
ప్రస్తుతం దాదాపు ఏడు ఏళ్ళ తరువాత మళ్ళి భాస్కర్ ఒక లక్కీ ఛాన్స్ పట్టేశాడు. అక్కినేని హీరో అఖిల్ నెక్స్ట్ సినిమాకు బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అనే ఆ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. నిజానికి ఈ ఆఫర్ రావడం భాస్కర్ కి ఒక అదృష్టమనే చెప్పాలి. అవకాశాలు రావడమే కష్టం అనుకున్న తరుణంలో గీత ఆర్ట్స్ బ్యానర్ లో మంచి ఆఫర్ అందుకున్నాడు.
అఖిల్ తో గనక భాస్కర్ హిట్ట కొడితే తప్పకుండా మరొక బంపర్ ఆఫర్ వచ్చే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. అల్లు అర్జున్ స్వయంగా దర్శకుడికి ఆఫర్ ఇచ్చినట్లు తెలుస్తోంది. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గనక హిట్టయితే అల్లు అర్జున్ పుష్ప అనంతరం భాస్కర్ తో ఒక సినిమా చేయాలని అనుకుంటున్నాడట. ఇప్పటికే అఖిల్ సినిమా మేకింగ్ పై ఒక లుక్కేసిన బన్నీకి ..అతని వర్క్ అమితంగా నచ్చేసిందట. పన్నెండేళ్ళ తరువాత పరుగు కాంబినేషన్ లో బన్నీ బొమ్మరిల్లు భాస్కర్ కాంబినేషన్ లో పరుగు సినిమా వచ్చింది. 25కోట్లకు పైగా లాభాలను అందించిన ఆ సినిమా అప్పట్లో బన్నీ మార్కెట్ ని అమితంగా పెంచేసింది. ఇక 12 ఏళ్ళ తరువాత మళ్ళీ ఈ కాంబినేషన్ లో మరో సినిమా రానున్నట్లు టాక్ వస్తోంది. ఇది ఎంతవరకు నిజమో తెలియదు గాని భాస్కర్ హిట్టు సినిమా తీస్తే నెక్స్ట్ అతనితోనే సినిమా చేయాలనీ బన్నీ అనుకుంటున్నాడు. మరి ఈ దర్శకుడు ఎలాంటి సక్సెస్ అందుకుంటాడో చూడాలి. లేదా కెరీర్ స్టార్టింగ్ నుండి ఇప్పటి వరకు సరైన సక్సెస్ లేని అఖిల్ భాస్కర్ ను కూడా లాక్కుంటాడా వేచి చూడాల్సిందే మరి.













