మరోసారి నితిన్ తో పూరీ సినిమా..
డేరింగ్ అండ్ డాషింగ్ డైరక్టర్ పూరీ జగన్నాథ్ నుంచి ఒక సినిమా వస్తుందంటే దానికి యూత్ లోనూ, మాస్ లోనూ ఎంతో ఇంట్రెస్ట్ ఉంటుంది. దానికి కారణాలు ఆయన సెలెక్ట్ చేసుకునే స్టోరీ, స్క్రీన్ ప్లే లు, వాటిని రియాలిటీకి దగ్గరగా ఆవిష్కరించే విధానం ఇవన్నీ ఆయన సినిమాపై ఆసక్తిని కలిగిస్తాయి. ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని హీరోగా ఇస్మార్ట్ శంకర్ తో సంచలన విషయాన్ని అందుకున్న పూరీ, ప్రస్తుతం రౌడీ హీరో విజయ్ దేవరకొండతో లైగర్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాతో అనన్య పాండే హీరోయిన్ గా టాలీవుడ్ కి పరిచయం కానుంది.
అయితే ఈ సినిమా తర్వాత పూరీ ఎవరితో సినిమా చేయనున్నాడనే ఆసక్తి ఇప్పుడు అందరిలో ఉంది. అది మరెవరో కాదు యంగ్ హీరో నితిన్ పేరు వినిపిస్తుంది. గతంలో నితిన్ హీరోగా పూరీ హార్ట్ ఎటాక్ సినిమా చేశాడు. కానీ ఆ సినిమా అనుకున్నంతగా ఆడలేదు. ఇప్పుడు పూరీ ఉన్న జోష్ వేరు గనుక నితిన్ కూడా పూరీ సినిమాకు ఓకే చెప్పే ఛాన్సులు ఎక్కువగానే ఉన్నాయంటున్నారు. ఈ సినిమాలో నితిన్ కు జంటగా నభా నటేష్ ను తీసుకోవాలనుకుంటున్నారట. కానీ ఇప్పటికే నభా, నితిన్ తో మాస్ట్రో చేస్తున్నందున పూరీ ఫోకస్ టాలీవుడ్ లేటెస్ట్ సెన్సేషన్ కృతి శెట్టి వైపు మళ్లిందట.
మామూలుగా హీరోయిన్స్ అందరూ పూరీ సినిమాలో నటించడమే చాలా లక్ అనుకుంటారు. దానికి తోడు నితిన్ హీరోగా అవడంతో కృతి కూడా ఈ సినిమాకు నో చెప్పడానికి పెద్దగా రీజన్స్ కనిపించడం లేదు. ఒక్క కాల్షీట్లు ఖాళీగా లేకపోతే తప్ప. ప్రస్తుతం నాని, సుధీర్ బాబు, రామ్ కు జోడీగా నటిస్తున్న కృతి, పూరీ సినిమాలో నటిస్తే, తన అందాలరె కొత్తకోణంలో చూడచ్చని కుర్రాళ్లు కుతూహలపడటం మాత్రం ఖాయం.













