అశోక్ గల్లా లుక్ విడుదల
గుంటూరు పార్లమెంట్ సభ్యుడు జయదేవ్ గల్లా కుమారుడు అశోక్ గల్లా హీరోగా పరిచయమవుతున్న విషయం విదితమే. నిధి అగర్వాల్ హీరోయిన్గా నటిస్తోంది. శ్రీరామ్ ఆదిత్య దర్శకుడు. పద్మావతి గల్లా నిర్మిస్తోన్న ఈ చిత్రంలో జగపతిబాబు, నరేష్, సత్యా, అర్చనా సౌందర్య కీలక పాత్రధారులు, ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే 50 శాతం చిత్రీకరణ పూర్తయింది. కరోనా వైరస్ లాక్డౌన్ కారణంగా షూటింగ్ నిలిచిపోయింది. అశోక్ గల్లా పుట్టినరోజును పురస్కరించుకొని ఈ చిత్రంలో ఆయన లుక్‌ను విడుదల చేశారు. టేబుల్‌పై కూర్చొని టేబుల్ ల్యాంప్ వెలుగులో దీక్షగా పుస్తకం చదువుతున్న లుక్ ఆకట్టుకుంటోంది. నిర్మాత పద్మావతి గల్లా మాట్లాడుతూ లాక్డౌన్ నేపథ్యంలో అందరూ ఇళ్లల్లో సురక్షితంగా ఉండాలని కోరారు. ప్రభుత్వాలు, డాక్టర్లు, పోలీసులు చెబుతున్న సలహాలు, సూచనలు తప్పనిసరిగా పాటిస్తూ కరోనా వైరస్ వ్యాప్తి నిరోధంలో భాగస్వాములు కావాలన్నారు. సూపర్ స్టార్ కృష్ణ, గల్లా అరుణకుమారి సంయుక్తంగా సమర్పిస్తోన్న ఈ చిత్రానికి చంద్రశేఖర్ రావిపాటి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తుండగా, జిబ్రాన్ సంగీతం సమకూరుస్తున్నారు.













