అవే మమ్మల్ని నడిపిస్తాయి
అతిలోక సుందరి స్వర్గానికేగి అప్పుడే ఏడాది అయిపోయింది. అయినా ఇప్పటికీ ఎవరూ ఆ నిజాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. అభిమానులకే అలా ఉంటే ఆ అందాల దేవతచే ప్రాణప్రదంగా ప్రేమించబడిన ఆమె కుమార్తెలకు ఎలా ఉంటుంది. వాళ్లయితే ఇప్పటికే వాళ్లమ్మ పేరెత్తితే చాలు కన్నీరుమున్నీరు అవుతున్నారు. అమ్మను తలచుకోకుండా మాకు ఏ రోజు గడవదని చెబుతున్నారు. తనన ఆరాధించేవాళ్లు కోట్లాదిమంది ఉన్నా సరే ఆమ్మ కోసం తన కెరీర్ను త్యాగం చేసింది. మా కోసం చేసే చిన్న చిన్న పనులతో ఎంతో సంతోషపడిపోయేది. పెద్దయ్యేవరకు మాకు కూడా మా అమ్మ గొప్పతనం తెలుసుకోలేకపోయాం. తెలిసాక ఎంతో సిగ్గుపడిపోయాం. అనుక్షణం మాకోసం తపించే మా అమ్మ మమ్మల్ని అంత త్వరగా విడిచి పెట్టి వెళ్లిపోతుందని, తన అభిమానులను ఇంత బాధపెడుతుందని మేము మాత్రం ఎలా అనుకుంటాం. అవే మమ్మల్ని నడిపిస్తాయి.. అంటూ వాళ్లమ్మ శ్రీదేవిని గుర్తు చేసుకున్నారు.













