ఆర్ఆర్ఆర్ సినిమా నా భాధ్యతను ఇంకా పెంచింది : పుట్టిన రోజు సందర్భంగా రామ్ చరణ్
ఆర్ఆర్ఆర్ సినిమా టాక్ డివైడ్ వున్నా కలెక్షన్స్ పరంగా బ్లాక్ బస్టర్గా నిలిచింది. కలెక్షన్లలో కొత్త కొత్త రికార్డులు క్రియేట్ చేయబోతోంది. మొదటి రోజే 223 కోట్లు కొల్లగొట్టేసింది. ఈ విజయంపై రామ్ చరణ్ తాజాగా స్పందించాడు. ఆర్ఆర్ఆర్ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. రాజమౌళి తన మీద పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు. ఎన్ని అంచనాలైనా పెట్టుకోండి.. దాన్ని మించేలా ఉంటుందన్న మాటలు నిజమయ్యాయి. ఒక్కో హీరోకు ఇచ్చిన ఎలివేషన్, చూపించిన తీరుకు అభిమానులే కాదు సగటు సినీ ప్రేక్షకుడు ఊగిపోయాడు. థియేటర్లో విజిల్స్ మోత మోగిపోయాయి. ఈలలు, గోలలతో థియేటర్లు దద్దరిల్లిపోతోన్నాయి.
మొత్తాని













