Om Raut: రూటు మార్చిన ఓం
బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్(Om ruat) అజయ్ దేవగన్(Ajay Devgan) తో చేసిన తన్హాజీ(Tanhaji) బ్లాక్ బస్టర్ అవడంతో వెంటనే ప్రభాస్(Prabhas) తో ఆదిపురుష్(Adipurush) ఛాన్స్ కొట్టేశాడు. కానీ ఓం రౌత్ ఆదిపురుష్ ను తెరకెక్కించిన విధానం చూసి అందరూ తీవ్రంగా నిరాశ చెందారు. రామాయణం అని చెప్పి ఓం ఏదేదో తీశాడని నెట్టింట ట్రోల్స్ కూడా వచ్చాయి. ఓం ఆదిపురుష్ ను తీసినందుకు అందరూ ఆయన్ని ఓ రేంజ్ లో విమర్శించారు.
అయినా సరే ఓం రౌత్ వెంటనే మరో సినిమాను చేయడానికి రెడీ అవుతున్నాడనే వార్తలు నెట్టింట వినిపించాయి. కానీ ఇప్పటివరకు ఆయన దర్శకత్వంలో సినిమా అనౌన్స్ అయింది లేదు. ప్రభాస్ ఓం కు మరో ఛాన్స్ ఇచ్చాడన్నారు కానీ ఆ వార్తల్లో నిజం లేదని తెలుస్తోంది. అయితే ఇప్పుడు ఎట్టకేలకు ఓం రౌత్ తన తర్వాతి ప్రాజెక్టును అనౌన్స్ చేశాడు.
అయితే ఈసారి ఓం రౌత్ డైరెక్టర్ గా కాకుండా నిర్మాతగా వ్యవహరించబోతున్నాడు. అది కూడా సినిమాకు కాదు. ఓ వెబ్ సిరీస్కు. ఫేమస్ యాక్టర్ మనోజ్ బాజ్(Manoj Baajpai) పేయ్ ముఖ్య పాత్రలో ఇన్స్పెక్టర్ జెండే(Inspector jende) అనే పేరుతో ఈ వెబ్ సిరీస్ రూపొందనుంది. ఈ సిరీస్కు చిన్మయి మాండ్లేకర్(Chinmayi Mandlekar) దర్శకత్వం వహించబోతున్నాడు. త్వరలోనే షూటింగ్ ను ప్రారంభించి వచ్చే ఏడాదిలోనే ఈ సిరీస్ను ఆడియన్స్ ముందుకు తీసుకురావాలని చూస్తున్నారట.













