Om Raut: ఆదిపురుష్ డైరెక్టర్ మళ్లీ కవర్ చేశాడుగా
ప్రభాస్(prabhas)- కృతి సనన్(krithi sanon) జంటగా ఓం రౌత్(Om Raut) దర్శకత్వంలో తెరకెక్కిన ఆదిపురుష్(Adhipurush) సినిమా రామాయణం ఆధారంగా రూపొందింది. ఎన్నో అంచనాలతో వచ్చిన ఆ సినిమా ఆ అంచనాలను అందుకోవడంలో విఫలమైంది. ఫలితంగా ఆదిపురుష్ ఫ్లాపైంది. అంతేకాదు, రామాయణం లాంటి గొప్ప కంటెంట్ ను ఓం రౌత్ అంత నాసిరకంగా తీస్తాడని ఎవరూ అనుకోలేదు.
ఆదిపురుష్ ఫ్లాపైనా డైరెక్టర్ ఓం రౌత్ ఆ విషయాన్ని ఒప్పుకోలేదు. తాను మంచి సినిమానే తీశానని చెప్తూ ఎప్పుడూ ఏదొక విషయంలో తన తప్పును కవర్ చేసుకుంటూ వస్తాడు. రీసెంట్ గా వేవ్స్ సమ్మిట్(Waves Summit2025) లో పాల్గొన్న ఓం రౌత్ మరోసారి ఆదిపురుష్ గురించి మాట్లాడాడు. మొన్న కూడా ఓం రౌత్ ఆదిపురుష్ ఫ్లాప్ కాదని చెప్పే ప్రయత్నమే చేశాడు.
ఆదిపురుష్ తెలుగు హక్కులు రూ.120 కోట్లకు అమ్ముడుపోయాయని, అంత రేటు పెట్టి సినిమాను కొన్నారంటే ఎక్కువ మంది ప్రేక్షకులు చూసినట్టే కదా అని, ఎవరైనా తమ సినిమా ఎక్కువ మందికి రీచ్ అవాలనే కోరుకుంటారని, ఈ రకంగా చూసుకుంటే తాను టార్గెట్ ను రీచ్ అయినట్టే అని చెప్పి ఆదిపురుష్ హిట్ అని చెప్పే ప్రయత్నం చేశాడు ఓం. ఆయన మాటలు విన్నాక ప్రభాస్ ఫ్యాన్స్ కు నోట మాటలు కరువయ్యాయి.
https://x.com/SAMTHEBESTEST_/status/1918323946459676835






