ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో కలెక్షన్ల రికార్డులు సృష్టించిన “ఒక్కడు”…
ప్రస్తుతం టాలీవుడ్ లో రీ రిలీజ్ హంగామా నడుస్తోందన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రీసెంట్ గా “ఖుషి” రిలీజ్ తో పవర్ స్టార్ ఫ్యాన్స్ ఫుల్ కుష్ అయ్యారు. ఇదిలా ఉండగా లేటెస్ట్ గా సూపర్ స్టార్ మహేష్ “ఒక్కడు” రీ రిలీజ్ తో ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. జనవరి 7న మహేష్ ఒక్కడు సినిమా రీ రిలీజ్ అయ్యింది. ఈ సినిమా ఇతి ఆంధ్రా, అటు తెలంగాణాలో భారీగా రిలీజ్ అవగా థియేటర్ల దగ్గర మహేష్ ఫ్యాన్స్ సందడి ఓ రేంజ్ లో ఉంది.
అన్ని చోట్ల రీ రిలీజ్ అవ్వడం ఒక ఎత్తయితే, హైదరాబాద్ లోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో మహేష్ స్టామినా ఏంటన్నది మరోసారి ప్రూవ్ అయ్యింది. రీ రిలీజ్ లో ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో మహేష్ ఒక్కడు రికార్డ్ కలెక్షన్స్ సాధించింది. అక్కడి థియేటర్ లో ఈ సినిమా 16.93 లక్షలు ఒక్కరోజులో కలెక్ట్ చేసి రికార్డు సృష్టించింది. ఇప్పటివరకు రీ రిలీజైన ఏ మూవీకి కూడా ఈ రేంజ్ కలెక్షన్స్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో రాలేదని తెలుస్తుంది. ఈ తరుణంలో మరోసారి బాక్సాఫీస్ దగ్గర సూపర్ స్టార్ మహేష్ స్టామినా ప్రూవ్ అయ్యిందని చెప్పొచ్చు. మహేష్ ఫ్యాన్స్ కి ఒక్కడు సినిమా అంటే విపరీతమైన క్రేజ్.
ఎమ్మెస్ రాజు నిర్మించిన ఈ సినిమాను గుణశేఖర్ డైరెక్ట్ చేశారు. భూమిక హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకు మణిశర్మ అద్భుతమైన మ్యూజిక్ అందించారు. సినిమాలో ప్రతి అంశం అలా పర్ఫెక్ట్ గా కుదరడంతో మహేష్ కెరీర్ లో ప్రత్యేకమైన సినిమాగా ఒక్కడు నిలిచింది. ఈ సినిమాతోనే మహేష్ మాస్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నారు. సినిమా ఆధ్యంతం కర్నూల్ బ్యాగ్రౌండ్ లో జరగడం విశేషం.













