‘ఒక్క క్షణం’ టీజర్ విడుదల
అల్లుశిరీష్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘ఒక్క క్షణం’. ఈ చిత్రం టీజర్‌ను ఈరోజు విడుదల చేసింది. టీజర్లో అగ్గిపుల్లలతో మనుషుల జీవితాల గురించి వివరించిన తీరు ఆకట్టుకుంటోంది. ‘నేను ప్రేమించిన అమ్మాయి ప్రాణాల మీదకొస్తే ఫేట్తో అయినా డెస్టినీతో అయినా చివరికి చావుతోనైనా పోరాడతా’ అని అల్లుశిరీష్ చెప్తున్న డైలాగ్ ఆకట్టుకుంటోంది. ఈ చిత్రంలో శిరీష్‌కి జోడీగా సురభి, సీరత్ కపూర్ నటిస్తున్నారు. ఆనంద్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. మణిశర్మ ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు. లక్ష్మి నరసింహ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని చక్రి చిగురుపాటి నిర్మిస్తున్నారు. డిసెంబర్లో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.













