ఓ బేబీకి గవర్నర్ అభినందనలు
సమంత ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ఓ బేబీ. ఈ చిత్రం ఇటీవల విడుదలై విశేష ప్రేక్షకాదరణతో విజయవంతంగా అన్ని చోట్లా ప్రదర్శితమవుతూ దాదాపు 40 కోట్లకి పైగా కలెక్షన్స్ని కలెక్ట్ చేసింది. ఇటీవల కాలంలో హీరోయిన్ ప్రధానంగా రూపొంది ఇంత మంది వసూళ్ళని రాబట్టిన సినిమా ఇదే కావడం విశేషం. అమ్మ గొప్పతనం, కుటుంబ అనుబంధాల నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని రాష్ట్ర గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ సతీసమేతంగా ప్రత్యేకంగా వీక్షించించారు. అద్భుతమైన అనుబంధాల సినిమా అంటూ చిత్ర బృందాన్ని ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో దర్శకురాలు నందినిరెడ్డి, నిర్మాతలు టి.జి. విశ్వప్రసాద్, వివేక్ కూచిభోట్లతో పాటు చిత్ర బృందం పాల్గొంది.













