OG: ఓజిలో స్పెషల్ ఎట్రాక్షన్ అదేనట

టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(pawan kalyan) హీరోగా సుజిత్(Sujeeth) దర్శకత్వంలో తెరకెక్కుతున్న గ్యాంగ్‌స్టర్ డ్రామా ఓజి(OG). భారీ అంచనాలతో వస్తోన్న ఈ సినిమాపై అందరికీ భారీ అంచనాలున్నాయి. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా సెప్టెంబర్ 25న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. రిలీజ్ దగ్గర పడుతున్న నేపథ్యంలో మేకర్స్ ఆల్రెడీ ప్రమోషన్స్ ను మొదలుపెట్టారు.
ప్రమోషన్స్ లో భాగంగా ఫస్ట్ లిరికల్ సాంగ్ ను రిలీజ్ చేసి ఆ సాంగ్ తో ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ ను అందుకున్నారు. ఓజాస్ గంభీర అంటూ సాగే ఫస్ట్ సాగ్ పవన్ ఫ్యాన్స్ ను బాగా ఆకట్టుకుంది. ఇదిలా ఉంటే ఇప్పుడు ఓజి నుంచి సెకండ్ సాంగ్ రిలీజ్ కు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఆ సాంగ్ గురించి ఇప్పుడో అప్డేట్ వినిపిస్తోంది.
ఓజి నుంచి సెకండ్ లిరికల్ గా వచ్చే పాట మెలోడీ అని, ఈ సాంగ్ లో పవన్ తో పాటూ ప్రియాంక అరుళ్ మోహన్(priyanka arul mohan) కూడా కనిపించనుందని, సినిమాలో ఈ రొమాంటిక్ సాంగ్ స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలవనుందని, ఈ సాంగ్ కు తమన్(thaman) కంపోజిషన్ తో పాటూ పవన్, ప్రియాంక మధ్య కెమిస్ట్రీ కూడా సాంగ్ ను మరింత స్పెషల్ గా చేస్తుందని అంటున్నారు. వచ్చే వారం ఓజి నుంచి సెకండ్ సాంగ్ రానుందని, త్వరలోనే దానికి సంబంధించిన అనౌన్స్‌మెంట్ రానుందని తెలుస్తోంది.