ఓజీ రిలీజప్పుడేనా?
పవన్ కళ్యాణ్ హీరోగా సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ థ్రిల్లర్ ఓజి. డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో డీవీవీ దానయ్య ఈ సినిను భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు. ముంబై మాఫియా బ్యాక్ డ్రాప్ నేపథ్యంలో పీరియాడిక్ జానర్ లో యాక్షన్ ప్యాక్డ్ కథాంశంతో ఈ సినిమా రూపొందనుందని ఇప్పటికే రిలీజైన పోస్టర్లు, గ్లింప్స్ ను చూస్తుటే అర్థమవుతోంది. ఏపీ ఎలక్షన్స్ కారణంగా పవన్ ఈ సినిమా షూటింగ్ నుంచి బ్రేక్ తీసుకున్నాడు. ఎలక్షన్స్ రిజల్ట్స్ రాగానే ఓజీ షూటింగ్ ను రీస్టార్ట్ చేసి సెప్టెంబర్ 27న రిలీజ్ చేద్దామని మేకర్స్ రిలీజ్ డేట్ ను కూడా అనౌన్స్ చేశారు. పవన్ 25 రోజుల కాల్షీట్స్ ఇస్తే సినిమా పూర్తవుతుందనే నమ్మకంతో మేకర్స్ రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేశారు.
కానీ ఏపీ ఎలక్షన్స్ లో పవన్ గెలవడంతో పాటూ హోం మినిస్టర్ అయ్యాడు. ప్రభుత్వ బాధ్యతల్లో పవన్ ఇకపై కీలకంగా వ్యవహరించనున్నాడు. మరో రెండు, మూడు నెలల వరకు పవన్ ప్రభుత్వ పనుల్లోనే బిజీగా ఉండే అవకాశముంది. ఆ తర్వాత ఈ ఏడాదిలోనే తను కమిటైన మూడు సినిమాలకూ డేట్స్ కేటాయించి వాటిని పూర్తి చేయాలని చూస్తున్నాడట పవన్.
అంటే చెప్పిన డేట్ కు ఓజీ రాదనేది ఫిక్స్. అందుకే దేవర ఆ ప్లేస్ ను లాక్ చేసుకుంది. పవన్ రెండు నెలల తర్వాత డేట్స్ ఇచ్చినా సరే సినిమా పూర్తవడానికి ఓ నెల, ఆ తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ కు ఇంకొంత టైమ్ కావాల్సి ఉంటుంది. అందుకే ఓజీ రిలీజ్ ను వచ్చే ఏడాదికి పోస్ట్ పోన్ చేసినట్లు టాక్ వినిపిస్తోంది. దీనిపై త్వరలోనే నిర్మాణ సంస్థ క్లారిటీ ఇవ్వనుంది.













