గేమ్ ఛేంజర్ పై ఓజీ ఎఫెక్ట్
రామ్ చరణ్ హీరోగా ప్రముఖ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా చిత్రం గేమ్ ఛేంజర్. చరణ్ కెరీర్లో 15వ సినిమాగా రూపొందుతున్న గేమ్ ఛేంజర్ దిల్ రాజు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. గేమ్ ఛేంజర్ ను సెప్టెంబర్ లో రిలీజ్ చేయనున్నట్లు దిల్ రాజు అప్పట్లో ఒకసారి చెప్పాడు.
కానీ గేమ్ ఛేంజర్ రిలీజ్ శంకర్ చేతిలోనే ఉంది. దిల్ రాజు అనుకున్న ప్రకారమైతే, సినిమాను సెప్టెంబర్ 27న రిలీజ్ చేస్తే అక్టోబర్ మొదటి వారం గాంధీ జయంతితో స్టార్ట్ చేసి, దసరా సెలవులు అయ్యే వరకు మంచి కలెక్షన్స్ రాబట్టుకోవచ్చే ఆలోచనతో ఉన్నాడట. దిల్ రాజు ఈ ఆలోచనతో ఉండగానే, పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఓజీ సినిమా ఆ డేట్ ను లాక్ చేసుకుంది.
ఓజీ రిలీజ్ డేట్ ను సడెన్ గా అనౌన్స్ చేయడం అసలెవరూ ఊహించలేదు. ఏపీ ఎన్నికల దృష్ట్యా పవన్ సినిమాలకు దూరంగా ఉన్నాడు. దీంతో పవన్ సినిమాలన్నీ లేటవుతాయని అందరూ అనుకున్నారు. కానీ మరో 20 రోజుల కాల్షీట్స్ ఇస్తే సినిమాను పూర్తి చేస్తానని సుజిత్ చెప్పడంతో పవన్ ఓకే అనేశాడట. అయితే పవన్ ఎప్పటినుంచి షూటింగ్ కు వస్తాడని మాత్రం చెప్పలేదట. ముందుగా రిలీజ్ డేట్ ను లాక్ చేసుకుంటే ఎందుకైనా మంచిదన్న ఉద్దేశంతో ఓజీ ముందు జాగ్రత్తగా ఈ ఆలోచనను చేసినట్లు తెలుస్తోంది. దీంతో గేమ్ ఛేంజర్ రిలీజ్ డేట్ కు చిక్కొచ్చి పడింది. మరి దసరాకైనా గేమ్ ఛేంజర్ ను రిలీజ్ చేస్తారో లేదా మరో డేట్ కోసం ఎదురుచూస్తారో చూడాలి.













