OG: పవన్ చేయాల్సింది ఇంకా ఉందట!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan) హీరోగా నటిస్తున్న సినిమాల్లో అన్నింటికంటే ఎక్కువ క్రేజ్ ఉన్న సినిమా ఏదంటే చిన్న పిల్లలైనా సరే వెంటనే ఓజి(OG) పేరు చెప్పేస్తారు. టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ సుజీత్(Sujeeth) తో పవన్ సినిమాను అనౌన్స్ చేసినప్పుడే ఓజి కు భారీ హైప్ వచ్చేసింది. దానికి తగ్గట్టే ఆ సినిమా నుంచి వచ్చిన గ్లింప్స్ కూడా ఆడియన్స్ కు విపరీతంగా నచ్చేయడంతో ఆ అంచనాలు ఇంకాస్త పెరిగాయి.
ఓజి మూవీ ఎప్పుడెప్పుడొస్తుందా అని ఫ్యాన్స్ ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న టైమ్ లో పవన్ పోర్షన్ షూటింగ్ పూర్తైందని వెల్లడిస్తూ చిత్ర యూనిట్ వెల్లడించిన విషయం తెలిసిందే. అయితే తాజా సమాచారం ప్రకారం పవన్ ఓజి సినిమా షూటింగ్ కు ఇంకా బాకీ ఉన్నాడని అంటున్నారు. ముంబైలో ఓజి టీమ్ ఓ మూడు రోజుల షెడ్యూల్ ను ప్లాన్ చేయగా, అందులో కొంతమేర పవన్ పై కూడా సీన్స్ తెరకెక్కించనున్నట్టు తెలుస్తోంది.
ముంబై షూటింగ్ కూడా అయిపోతే పవన్ ఓజి షూటింగ్ ను ఫినిష్ చేసినట్టవుతుందని చెప్తున్నారు. ప్రియాంక అరుళ్ మోహన్(Priyanka Arul Mohan) హీరోయిన్ గా నటించనున్న ఈ యాక్షన్ థ్రిల్లర్ సినిమాలో ఇమ్రాన్ హష్మీ(Emran Hashmi) విలన్ గా నటిస్తున్నాడు. టాలీవుడ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్(Thaman) ఓజి సినిమాకు సంగీతం అందిస్తుండగా, ఈ సినిమాను డీవీవీ ఎంటర్టైన్మెంట్స్(DVV Entertainments) బ్యానర్ లో దానయ్య(Danayya) భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.