OG: ఓజి విషయంలో ఫ్యాన్స్ కు బాంబు

పవన్ కళ్యాణ్(pawan kalyan) హీరోగా నటించిన ఓజి(OG) సినిమా ఎప్పుడు రిలీజవుతుందా అని ఫ్యాన్స్ వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. సుజిత్(sujeeth) దర్శకత్వంలో తెరకెక్కి ఈ సినిమాను చూడ్డానికి ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఉన్నారు. ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు యూఎస్ లోని పవన్ ఫ్యాన్స్ కు ఓ బ్యాడ్ న్యూస్ తెలిసింది.
ఓజి మూవీని యూఎస్ లో ప్రత్యంగిర సినిమాస్(Pratyangira Cinemas) రిలీజ్ చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ప్రత్యంగిర సినిమాస్ ఓజి సినిమా గురించి చేసిన పోస్ట్ పవన్ ఫ్యాన్స్ కు నిరాశను మిగిల్చింది. ఈ సినిమాకు ఐమాక్స్, DBoxtech, 4DX, డాల్బీ ఫార్మాట్లు ఉండవని, హాలీవుడ్ టైటిల్స్ తో ముందుగాచేసుకున్న డీల్ వల్ల ఓజికి ఈ ఫార్మాట్లు ఉండవని, ఈ సినిమా కేవలం PLF మరియు స్టాండర్డ్ ఫార్మాట్స్ లో ప్రదర్శించబడుతుందని తెలిపారు.
అయితే ఓజి నుంచి ఇప్పటివరకు వచ్చిన పోస్టర్లు, టీజర్లు, లిరికల్ వీడియోలు మంచి క్వాలిటీతో రావడం చూసి పోస్టర్లే ఇంత క్వాలిటీతో ఉంటే సినిమా ఇంకెంత క్వాలిటీతో ఉంటుందో, దీన్ని తప్పకుండా ఐమాక్స్ వెర్షన్ లో చూడాలని ఫ్యాన్స్ భావించారు. కానీ వారి ఆశలపై నీళ్లు చల్లుతూ ప్రత్యంగిర సినిమాస్ ఈ బాంబును పేల్చడంతో పవన్ ఫ్యాన్స్ డిజప్పాయింట్ అవుతున్నారు. కాగా ఓజి సినిమా సెప్టెంబర్ 25న ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే.