OG: ఓజీ సెప్టెంబర్ రిలీజ్.. నిజమెంత?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan) నుంచి రానున్న సినిమాల్లో హరిహర వీరమల్లు(harihara veeramallu) ఒకటి కాగా మరొకటి ఓజి(OG). వీటిలో వీరమల్లు మే 9న రిలీజ్ కానున్నట్టు మేకర్స్ అనౌన్స్ చేసినప్పటికీ ఆ మూవీ కంటే ఎక్కువగా ఓజీ పైనే ఎక్కువ హైప్ ఉంది. ఓజీ కోసం పవన్ ఫ్యాన్స్ చాలా ఎంతగానో వెయిట్ చేస్తున్నారు. ఈ రెండు సినిమాలకు హైప్, క్రేజ్, బజ్ విషయంలో చాలా తేడా ఉంది.
షూటింగ్ లోనే ఎంతో కాలం ఉండటం వల్ల వీరమల్లుపై ఆశలు తగ్గుతుండగా, ఓజీకి మాత్రం టీజర్ తోనే నెక్ట్స్ లెవెల్ హైప్ వచ్చేసింది. ఇదిలా ఉంటే పవన్ ఓజీకు మే, జూన్ నెలల్లో డేట్స్ ఇవ్వనున్నాడని తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఓజీ సెప్టెంబర్ లో ప్రేక్షకుల ముందుకొచ్చే ఛాన్స్ ఉందని డిస్ట్రిబ్యూటర్లలో ప్రచారం మొదలైంది.
ఈ వార్త పవన్ ఫ్యాన్స్ కు ఆనందాన్ని కలిగిస్తున్నప్పటికీ అందులో నిజమెంతన్నది కూడా చూడాలి. వీరమల్లు వచ్చిన నాలుగు నెలల్లో పవన్ నుంచి మరో పాన్ ఇండియా మూవీ రిలీజవడమంటే మాటలు కాదు. ఒకవేళ షూటింగ్ పూర్తైనా ఆ తర్వాత పోస్ట్ ప్రొడక్షన్, ఇంకా చాలా వర్క్స్ ఉంటాయి. ఒక వేళ అన్నింటినీ పూర్తి చేసుకుని రిలీజ్ చేసుకుందామన్నా సెప్టెంబర్ లో పోటీ చాలా ఎక్కువగా ఉంది. మరి ఇలాంటి పరిస్థితుల్లో నిజంగా ఓజీ సెప్టెంబరులో రావాలనుకుంటే ముందుగానే రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేసుకోవడం బెటర్.













