ఓజి స్టోరీ లైన్ ఇదేనా?
పవన్ కళ్యాణ్ హీరోగా సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ గ్యాంగ్స్టర్ డ్రామా ఓజి. భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా సినిమాగా రూపొందుతున్న ఈ సినిమాను డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద డీవీవీ దానయ్య నిర్మిస్తున్నాడు. ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్. ఈ సినిమాను సెప్టెంబర్ 27న రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ఇప్పటికే అనౌన్స్మెంట్ కూడా ఇచ్చారు.
ఇదిలా ఉంటే ఈ సినిమా గురించి ప్రస్తుతం నెట్టింట ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ వినిపిస్తోంది. ఓజి సినిమా స్టోరీ ఇదేనంటూ సోషల్ మీడియాలో వార్తలొస్తున్నాయి. ఈ సినిమా గ్లింప్స్ ను బట్టి ఓజి మాఫియా బ్యాక్ డ్రాప్ లో ఉండే సినిమా అని తెలుస్తోంది. ముంబై నేపథ్యంలో కథ ఉంటుందని, వాయిస్ ఓవర్ ను బట్టి పవన్ మాఫియాను వదిలేసి మళ్లీ పదేళ్ల తర్వాత తిరిగొచ్చి శత్రువుల మీద రివెంజ్ తీర్చుకుంటాడని అర్థమవుతుంది.
ఈ నేపథ్యంలో ఈ కథ ఎంత వరకు నిజమన్నది తెలియాల్సి ఉంది. ఓజి సినిమాను సుజిత్ హై ఓల్టేజ్ యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిస్తున్నాడని, సినిమాలో కచ్ఛితంగా ఎలివేషన్ సీక్వెన్స్ తో పాటూ ఎమోషనల్ బ్లాక్స్ కూడా ఉండనున్నాయని తెలుస్తోంది. సాహో సినిమా విషయంలో జరిగిన పొరపాట్లు ఓజి విషయంలో జరగకుండా సుజిత్ జాగ్రత్తలు తీసుకుంటున్నాడట. ఏపీలో ఎలక్షన్స్ హడావిడి అయిపోయాక పవన్ కళ్యాణ్, ఓజి షూటింగ్ లో పాల్గొనున్నాడు.













