OG: ఓజీ యూనిట్ లో కీలక మార్పు
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan kalyan) ప్రస్తుతం ఓ వైపు రాజకీయాల్లో బిజీగా ఉంటూనే మరోవైపు తాను కమిట్ అయిన సినిమాలను పూర్తి చేయాలని పూనుకున్నారు. అందులో భాగంగానే ఆల్రెడీ హరిహర వీరమల్లు(Hari Hara Veeramallu) షూటింగ్ ను పూర్తి చేశాడు. ఆ సినిమాతో పాటూ పవన్ ఓజీ(OG) సినిమాను కూడా పూర్తి చేయాల్సి ఉందన్న సంగతి తెలిసిందే.
సుజీత్(Sujeeth) దర్శకత్వంలో డీవీవీ ఎంటర్టైన్మెంట్స్(DVV Entertainments) బ్యానర్ లో డీవీవీ దానయ్య(DVV Danayya) భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఓజీ సినిమా షూటింగ్ ఆల్రెడీ చాలా వరకు షూటింగ్ ను పూర్తి చేసుకుంది. తర్వాత పవన్ రాజకీయాల్లో బిజీగా ఉండి షూటింగ్ ఆగిపోయింది. ఇప్పుడు మళ్లీ పవన్ షూటింగ్ కు డేట్స్ ఇచ్చేసరికి షూటింగ్ రీస్టార్ట్ అయింది.
అయితే ఓజీ సినిమా షూటింగ్ రీస్టార్ట్ అయిన తర్వాత ఈ చిత్ర యూనిట్ లో ఓ కీలక మార్పు వచ్చినట్టు తెలుస్తోంది. ఇదివరకు ఓజీకి రవి కె చంద్రన్(Ravi K Chandran) సినిమాటోగ్రఫర్ గా పని చేయగా, ఇప్పుడు ఆ స్థానంలోకి మనోజ్ పరమహంస(Manoj Paramahamsa) వచ్చినట్టు తెలుస్తోంది. దానికి కారణమేంటన్నది తెలియదు కానీ ప్రస్తుతం ఈ విషయం ఫిల్మ్ నగర్ లో గట్టిగానే వినిపిస్తోంది.






