OG: ఓజి రన్ టైమ్ ఎంతంటే?

హరి హర వీరమల్లు(Hari hara veeramallu) తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(pawan kalyan) నుంచి రాబోతున్న సినిమా ఓజి(OG). ఈ సినిమాపై మొదటి నుంచి భారీ అంచనాలున్నాయి. పవన్ కెరీర్లోనే భారీ క్రేజ్ తో రాబోతున్న సినిమాల్లో ఓజి కూడా ఒకటి. సుజిత్(sujeeth) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో ప్రియాంక అరుళ్ మోహన్(priyanka arul mohan) హీరోయిన్ గా నటిస్తుండగా డీవీవీ దానయ్య(DVV Danayya) ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మించారు.
సెప్టెంబర్ 25న ఓజి సినిమా ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుండగా, రిలీజ్ దగ్గర పడుతున్న కొద్దీ ఓజిపై హైప్ భారీగా పెరుగుతుంది. ఈ నేపథ్యంలోనే ఓజి సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. సెన్సార్ పూర్తి చేసుకున్న ఓజికి యూఎ సర్టిఫికెట్ రాగా ఈ సినిమా రన్ టైమ్ గురించి టాలీవుడ్ సర్కిల్స్ లో ఓ అప్డేట్ వినిపిస్తోంది.
ఓజి రన్ టైమ్ మొత్తం 156 నిమిషాలుంటుందని అంటున్నారు. అంటే 2 గంటల 36 నిమిషాల నిడివి. ఈ రెండున్నర గంటల పాటూ పవన్ ఫ్యాన్స్ కు థియేటర్లలో మ్యాడ్‌నెస్ ఖాయమని అంటున్నారు. అయితే ఓజి రన్ టైమ్ పై అధికారిక ప్రకటన రావాల్సి ఉండగా, ఏపీ ప్రభుత్వం ఓజి సినిమాకు టికెట్ రేట్లను భారీ స్థాయిలో పెంచిన విషయం తెలిసిందే.