OG: ఓజి ఫస్ట్ సాంగ్ వచ్చేది ఆ రోజునే!
టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(pawan Kalyan) హీరోగా యంగ్ డైరెక్టర్ సుజీత్(Sujeeth) దర్శకత్వంలో వస్తోన్న సినిమా ఓజి(OG). ఈ సినిమాలో ప్రియాంక అరుళ్ మోహన్(Priyanka Arul Mohan) హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఓజి సినిమాకు సంబంధించిన షూటింగ్ పూర్తి కాగా, మొదటి నుంచి ఈ సినిమాపై ఫ్యాన్స్ కు భారీ అంచనాలున్నాయి. అందుకే పవన్ ఫ్యాన్స్ ఈవెంట్ తో సంబంధం లేకుండా ఓజి, ఓజి అంటూ అరుస్తూ ఉంటారు.
అనౌన్స్మెంట్ తోనే భారీ క్రేజ్ తెచ్చుకున్న ఓజి సినిమా నుంచి వచ్చిన గ్లింప్స్ సినిమాపై మరిన్ని అంచనాలను పెంచగా ఈ మూవీ సెప్టెంబర్ 25న రిలీజ్ కానున్నట్టు తెలుస్తోంది. రిలీజ్ డేట్ దగ్గర పడుతున్ననేపథ్యంలో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ ను మొదలుపెట్టాలని చూస్తోంది. అందులో భాగంగానే మేకర్స్ ఈ సినిమా నుంచి ఫస్ట్ లిరికల్ ను రిలీజ్ చేయాలని భావిస్తున్నారట.
ఈ వీకెండ్ కు ఓజి ఫస్ట్ సాంగ్‌కి సంబంధించిన అనౌన్స్మెంట్ ను ఇస్తూ ఓ కొత్త పోస్టర్ ను రిలీజ్ చేయనున్నారట. ఫైర్ స్ట్రామ్ ఈజ్ కమింగ్ అంటూ రానున్న ఈ సాంగ్ ను శింబు(Simbhu) పాడగా, తమన్(Thaman) ఈ సాంగ్ ను నెక్ట్స్ లెవెల్ లో కంపోజ్ చేశాడని తెలుస్తోంది. డీవీవీ ఎంటర్టైన్మెంట్స్(DVV Entertainments) బ్యానర్ లో డీవీవీ దానయ్య(DVV Danayya) ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మించిన సంగతి తెలిసిందే.







