OG: ఓజి ఫస్ట్ సింగిల్ అప్డేట్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan) కమిట్ అయిన సినిమాల్లో ఓజి(OG) ఒకటి. టాలెంటెడ్ డైరెక్టర్ సుజీత్(Sujeeth) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా అనౌన్స్‌మెంట్ తోనే భారీ అంచనాలను పెంచేసింది. ఇంకా చెప్పాలంటే పవన్ నటిస్తున్న సినిమాల్లో ఓజి సినిమానే మోస్ట్ అవెయిటెడ్ మూవీ. పాన్ ఇండియా లెవెల్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా పై ఆల్రెడీ మంచి హైప్ నెలకొంది.
సెప్టెంబర్ లో ఓజి సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్నట్టు మేకర్స్ ఇప్పటికే అనౌన్స్ చేశారు. ప్రియాంక అరుళ్ మోహన్(Priyanka Arul Mohan) హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో ఇమ్రాన్ హష్మీ(Emran Hashmi) విలన్ గా నటిస్తున్నాడు. ఈ సినిమాకు తమన్(Thaman) ఇవ్వనున్న మ్యూజిక్ పై అందరికీ భారీ అంచనాలున్నాయి. అయితే ఓజి సినిమాకు సంబంధించి ఇప్పుడో అప్డేట్ వినిపిస్తోంది.
ఓజి రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న సందర్భంగా మేకర్స్ ఈ సినిమా నుంచి ఫస్ట్ సాంగ్ ను రిలీజ్ చేయాలని చూస్తున్నారట. వాస్తవానిక ఈ సాంగ్ ఎప్పుడో రిలీజవాల్సింది కానీ పలు కారణాల వల్ల అది రిలీజవలేదు. దానికి తోడు వీరమల్లు(Veeramallu) రిలీజ్ అవుతున్న టైమ్ లో ఓజి అప్డేట్స్ ఎందుకులే అని దానిపై పెద్దగా ఫోకస్ చేయలేదు. ఆగస్ట్ ఫస్ట్ వీక్ లో ఓజి ఫస్ట్ సింగిల్ ను రిలీజ్ చేసే ఆలోచనలో మేకర్స్ ఉన్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే తమన్ ఈ ఫస్ట్ సింగిల్ ను కోలీవుడ్ స్టార్ శింబు(Simbhu) తో పాడించిన సంగతి తెలిసిందే.