OG: నైజాంలో రూ.50 కోట్ల క్లబ్ లోకి ఓజి

తెలుగు సినిమాలకు నైజాం ఏరియా చాలా పెద్ద బిజినెస్ ఏరియా అని చెప్పాలి. నైజాం లో కూడా ఎక్కువ బిజినెస్ హైదరాబాద్ లోనే అవుతుంది. తెలుగు చిత్ర పరిశ్రమలోని ఎంతో మంది స్టార్లకు నైజాం ఏరియా కంచు కోట లాంటది. అలాంటి నైజాంలో ఇప్పటికే పలు సినిమాలు రూ.50 కోట్ల క్లబ్ లో చేరగా ఇప్పుడు పవన్(pawan) నటించిన ఓజి(OG) మూవీ కూడా ఆ జాబితాలోకి తోడైంది.
పవన్ కళ్యాణ్(pawan kalyan) హీరోగా సుజిత్(sujeeth) దర్శకత్వంలో తెరకెక్కిన ఓజి సినిమా భారీ అంచనాలతో రిలీజై, ప్రేక్షకుల నుంచి భారీ రెస్పాన్స్ ను అందుకుంది. ఈ సినిమాకు ఫస్ట్ షో నుంచే మంచి రెస్పాన్స్ వస్తుండగా, ఇప్పుడు ఓజి మూవీ నైజాంలో రూ.50 కోట్ల క్లబ్ లోకి చేరింది. ఈ లిస్ట్ లోకి చేరిన 7వ సినిమాగా ఓజి మూవీ రికార్డు సృష్టించగా, పవన్ ఈ ఘనతను సాధించడం ఇదే మొదటిసారి.
మార్కెట్ పరంగా నైజాం కు క్రేజ్ పెరుగుతుండగా, ఇప్పటికే పలు సినిమాలు రూ.50 కోట్ల కలెక్షన్ల మార్క్ ను దాటి రచ్చ లేపుతున్నాయి. 2017లో మొదటిసారి బాహుబలి2(baahubali2) ఈ రికార్డును సాధించగా, ఆ తర్వాత ఆ రికార్డు బ్రేక్ అవడానికి ఏడేళ్లు పట్టింది. ఆర్ఆర్ఆర్(RRR) మూవీ బాహుబలి2 రికార్డును బ్రేక్ చేయగా, తర్వాత సలార్(Salaar), కల్కి(Kalki) సినిమాలు కూడా ఈ మార్క్ ను అందుకుంది. గతేడాది వచ్చిన దేవర(Devara), పుష్ప2(Pushpa2) సినిమాలు కూడా నైజాం లో రూ.50 కోట్ల మార్క్ ను దాటాయి. ఓజి సినిమా నైజాంలో రూ.50 కోట్ల క్లబ్ లోకి చేరడంపై ఫ్యాన్స్ ఎంతో ఆనందంగా ఉన్నారు.