ఓ మనిషి నీవెవరు సెన్సార్ పూర్తి
రిజ్వాన్ కల్ షాన్, సుమన్, చలపతిరావు, హరి, తరుణ్ కుమార్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం ఓ మనిషి నీవెవరు. గాడ్ మినీస్ట్రీస్ సమర్పణలో స్వర్ణ క్రియేషన్స్ పతాకంపై కృష్ణమూర్తి రాజ్‌కుమార్ నాయుడు దర్శకత్వంలో స్వర్ణ కుమారి దొండపాటి నిర్మించారు. ప్రభాకర్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి అయ్యాయి. డిసెంబర్లో అయిదు భాషల్లో గ్రాండ్‌గా విడుదలవుతుంది. ఈ సందర్భంగా హీరో సుమన్ మాట్లాడుతూ ఈ సినిమాలో ఓ పాత్ర ఉందని నిర్మాతగారు చెప్పగానే ఆలోచించకుండా ఒక అదృష్టంగా భావించి చేసాను. చాలా వైవిథ్యంగా ఉంటుంది. ఇలాంటి సినిమాలు చేయాలంటే చాలా ధైర్యం ఉండాలి. ఇలాంటి సినిమాలు చేయాలంటే అదృష్టం కూడా ఉండాలి. ఏసు పాత్రకు రిజ్వాన్ బాగా సూటయ్యాడు. సినిమా విజయం సాధించి అందరికీ మంచి పేరు తీసుకొస్తుందన్న నమ్మకం ఉంది అని అన్నారు.













