ఆయనకు అత్యున్నత పురస్కారం… తెలుగు ప్రజలకు గర్వకారణం : జస్టిస్ ఎన్వీ రమణ
గోవాలో జరిగిన అంతర్జాతీయ భారత చలన చిత్రోత్సవాల్లో ప్రముఖ సినీ నటుడు చిరంజీవికి ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్-2022 పురస్కారాన్ని ప్రకటించడంపై సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ హర్షం వ్యక్తం చేశారు. సినీ రంగంలో చిరంజీవి స్వయంకృషితో అత్యున్నత శిఖరాలను అధిరోహించారని ఆయన అభినందించారు. ఆయనకు ఈ అత్యున్నత పురస్కారం లభించడం తెలుగు ప్రజలందరికీ గర్వకారణమని పేర్కొన్నారు. చిరంజీవికి శుభాకాంక్షలు తెలుపుతూ ఆయన ప్రత్యేకంగా లేఖ రాశారు.













