వాలెంటైన్స్ డే కి రీరిలీజ్ అవుతున్న “నువ్వొస్తానంటే నేనొద్దంటానా “…
టాలీవుడ్ లో రీరిలీజ్ ల ట్రెండ్ నడుస్తున్న తరుణంలో ఫిబ్రవరి 14 వాలెంటైన్స్ డే సందర్భంగా ఆల్ టైం సూపర్ హిట్ లవ్ స్టోరీ అయిన ” నువ్వొస్తానంటే నేనొద్దంటానా ” చిత్రాన్ని రీరిలీజ్ చేయడాని ఈ సినిమా మేకర్స్ రెడీ అవుతున్నట్లు తెలుస్తుంది. ఈ యూత్ ఫుల్ లవ్ స్టోరీని ఎన్ని సార్లు చూసినా ఇప్పటికి ఫ్రెష్ ఫీల్ రావడం విశేషం. ఒకప్పుడు కుర్రకారు మనసుల్ని దోచుకున్న ఈ సినిమా మళ్ళీ రీరిలీజ్ అవుతుందంటే ఇక యూత్ కి పండగే అని చెప్పాలి. 2005 జనవరి 14 న ఈ సినిమా రిలీజ్ అయింది.
అప్పట్లో బాక్సాఫీస్ వద్ద యూత్ ఫుల్ లవ్ స్టోరీగా నిలిచి సూపర్ హిట్ టాక్ ని సొంతం చేసుకుంది. కల్లెక్షన్ల పరంగా కూడా నిర్మాతలకి కాసుల వర్షం కురిపించించి. సరిగ్గా 18 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఈ సినిమా వెండితెరపై మరోసారి ప్రేక్షకులని కనువిందు చేయనుంది. ఎమోషన్స్ ని, బ్రదర్ అండ్ సిస్టర్ సెంటిమెంట్ ని బాలన్స్ చేస్తూ, ఎక్కడ కూడా లవ్ ఫీల్ ని పోనివ్వకుండా దర్శకుడు ఈ చిత్రాన్ని చాలా చక్కగా తెరకెక్కించాడు. ఇక ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ ఈ సినిమాకి అందించిన మ్యూజిక్ సంగీత ప్రియులని మరో లోకంలోకి తీసుకెళ్ళిందంటే అతిశయోక్తి కాదు.
సిద్దార్థ్, త్రిష జంటగా నటించిన ఈ చిత్రాన్ని టాలీవుడ్ అగ్ర నిర్మాత ఎం.ఎస్ రాజు నిర్మించగా, ప్రముఖ కొరియోగ్రాఫర్ ప్రభుదేవా ఈ సినిమాని డైరెక్ట్ చేసారు. స్క్రిప్ట్ రైటర్ వీరు పోట్ల ఈ సినిమాకి చక్కటి కథని అందించారు. తెలుగులో సూపర్ హిట్టైన ఈ సినిమాని వరుసగా ఎనిమిది భాషల్లో రీమేక్ చేయడం జరిగింది. రీమేక్ అయిన ప్రతి భాషలోనూ ఈ సినిమా సూపర్ హిట్ అవ్వడం విశేషం. ఇక ప్రేమికుల రోజున మరోసారి రిలీజ్ అవుతున్న ఈ సూపర్ హిట్ లవ్ స్టోరీ ప్రేక్షకులని మళ్ళీ థియేటర్స్ కి రప్పిస్తుందో లేదో చూడాలి.













