సెంట్రల్ జైలుకి నూతన్‌నాయుడు…
దళిత యువకుడి శిరోముండనం కేసుతో పాటు పలు చీటింగ్ కేసుల్లో అరెస్టయిన సినీ నిర్మాత నూతన్‌నాయుడి పోలీస్ కస్టడీ సోమవారంతో ముగిసింది. ఆయనను సెంట్రల్ జైలుకి తరలించనున్నారు. అయితే ఈలోగా ఆయన అనారోగ్యం పేరుతో కాసేపు హంగామా చేశారు. అయితే వైద్య పరీక్షల్లో ఆయన ఆరోగ్యంగా ఉన్నట్టు తేలింది. దీంతో ఆయన కారాగార వాసం ఖరారయ్యింది.
నూతనంగా మరో 2 కేసులు..
మరోవైపు నూతన్‌నాయుడి మీద కేసుల పరంపర కొనసాగుతూనే ఉంది. ఆయన మోసాలు ఒకటొకటిగా వెలుగు చూస్తూనే ఉన్నాయి. తాజాగా ఆయన ఒక రియల్టర్‌ని మోసం చేసి రూ.12 కోట్ల భారీ మొత్తాన్ని దోచేశారంటూ ఓ కేసు దాఖలైంది. అలాగే ఒక సాధారణ నిరుద్యోగికి అటెండర్ ఉద్యోగం ఇప్పిస్తానంటూ రూ.5లక్షలు దండుకున్నట్టు ఇంకో కేసు కూడా ఆయన మీద నమోదైంది.













