దేవరకు పోటీగా మరో రెండు సినిమాలు
దేవర సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్ 5న ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు ఇప్పటికే మేకర్స్ అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. రెండు భాగాలుగా రానున్న దేవర, మొదటి భాగం మాత్రం చెప్పిన డేట్‌కు వచ్చేలా మేకర్స్ ప్లాన్ చేసుకుని చాలా పకడ్బందీగా షూట్ చేస్తున్నారు. జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు అనిరుధ్ రవించందర్ సంగీతం అందిస్తున్నాడు.
పోటీ పరంగా ఈ సినిమాకు ఎలాంటి రిస్క్ లేదని ఎన్టీఆర్ ఫ్యాన్స్ భావిస్తున్న టైమ్ లో దేవరకు మరో రెండు సినిమాలు పోటీగా వచ్చేట్లు కనిపిస్తున్నాయి. దేవర రిలీజ్ తర్వాత సరిగ్గా వారానికి సూర్య పాన్ ఇండియా సినిమా కంగువాను ఏప్రిల్ 11న రిలీజ్ చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. అఫీషియల్ గా అనౌన్స్ చేయలేదు కానీ డిస్ట్రిబ్యూటర్లకు ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్లు టాక్.
ఇదే తేదీకి ఇండియన్2 సినిమాను కూడా రిలీజ్ చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని మరో వార్త వినిపిస్తోంది. శంకర్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వగానే ఇండియన్2 రిలీజ్ డేట్ అనౌన్స్మెంట్ రానుంది. దేవర డేట్‌కు రిలీజ్ కాకపోయినా, ఈ రెండు సినిమాలు పైన చెప్పిన డేట్స్‌కు వస్తే మాత్రం ఆ ఎఫెక్ట్ దేవరపై కచ్ఛితంగా పడుతుంది.













