దేవరలో ప్రతీ ఫైటూ క్లైమాక్స్‌లా!
యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా దేవర. జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో సైఫ్ అలీ ఖాన్ విలన్ పాత్ర పోషిస్తున్నాడు. ఈ సినిమాపై మొదటి నుంచి మంచి అంచనాలుండగా, రీసెంట్ గా రిలీజైన గ్లింప్స్ ఆ అంచనాలను ఆకాశాన్నంటేలా చేసింది. ఈ సినిమాతో కొరటాల తనలోని కొత్త యాంగిల్ ను చూపించబోతున్నాడని గ్లింప్స్ తోనే అర్థమైపోయింది.
సముద్రం బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో యాక్షన్ సీన్స్ స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలవనున్నాయని మొదటి నుంచే అంటున్నారు. తాజా సమాచారం ప్రకారం, దేవర తర్వాతి షెడ్యూల్లో ఎన్టీఆర్- సైఫ్ మధ్య రెండు భారీ యాక్షన్ సీక్వెన్స్ ను కొరటాల తెరకెక్కించబోతున్నట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం దానికి సంబంధించిన సెట్ రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. పీటర్ హెయిన్స్ ఈ ఫైట్స్ ను కొరియోగ్రఫీ చేయనున్నట్లు సమాచారం. ఈ ఫైట్స్ ఎంతో సాహసోపేతంగా ఉంటాయని, వీరిద్దరి మధ్య జరిగే యాక్షన్ ఎపిసోడ్స్ చాలా కొత్తగా, ప్రతి ఫైటూ క్లైమాక్స్‌లా ఉంటుందని అంటున్నారు. ఈ సినిమా రెండు భాగాలుగా రానున్న విషయం తెలిసిందే. దేవర పార్ట్1 ఏప్రిల్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది.













