వచ్చే సమ్మర్‌కు సోలోగా తారక్
ఎన్టీఆర్, కొరటాల శివ దర్శకత్వంలో భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా దేవర సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. జాన్వీ కపూర్ హీరోయిన్ గా, సైఫ్ అలీ ఖాన్ విలన్ గా నటిస్తుండటంతో ఈ సినిమాపై బాలీవుడ్ ఆడియన్స్ లో కూడా స్పెషల్ ఇంట్రెస్ట్ ఏర్పడింది. యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో ఫిక్షనల్ స్టోరీతో ఈ సినిమాను కొరటాల తెరకెక్కిస్తున్నాడు.
తన గత చిత్రమైన ఆచార్య సినిమా డిజాస్టర్ కావడంతో దేవర సినిమాపై కొరటాల స్పెషల్ కేర్ తీసుకుని మరీ దీన్ని తెరకెక్కిస్తున్నాడు. ఆర్ఆర్ఆర్ తర్వాత ఎన్టీఆర్ నుంచి వస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై అందరి కన్ను ఉంటుంది. దేవరను వచ్చే యేడాది ఏప్రిల్ 5న రిలీజ్ చేయనున్నట్లు ఇప్పటికే మేకర్స్ ప్రకటించారు కూడా.
శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న దేవరను చూస్తే అక్టోబర్ నాటికి షూటింగ్ పూర్తవుతుందేమో అనిపించక మానదు. కొరటాల కూడా సినిమాను వీలైనంత త్వరగా పూర్తి చేసి గ్రాఫిక్స్ వర్క్ ను మెల్లిగా జాగ్రత్తలు తీసుకుని చేయించాలని చూస్తున్నాడట. అంటే పోస్ట్ ప్రొడక్షన్ కు దాదాపు 6 నెలల టైమ్ ఉంటుంది.
కాబట్టి దేవర విషయంలో ఏ వర్క్ హడావుడి లేకుండా అన్నీ జాగ్రత్తగా చూసుకోవచ్చనేది కొరటాల ప్లాన్. ఇదిలా ఉంటే వచ్చే సమ్మర్ కు ఇప్పటి వరకు షెడ్యూల్ అయిన సినిమా దేవర ఒక్కటే. ఎలాగూ ప్రాజెక్ట్ కె సంక్రాంతికి రానుంది. చరణ్ గేమ్ ఛేంజర్ రిలీజ్ ఎప్పడున్నది తెలీదు. ఈ నేపథ్యంలో ఏప్రిల్ లో వచ్చే పాన్ ఇండియన్ ఫిల్మ్ దేవర ఒక్కటే. అంటే వచ్చే సమ్మర్‌కు తారక్ సోలోగా బాక్సాఫీస్ ను ఏలనున్నాడన్నమాట.













