హైప్ పెంచనున్న దేవర గ్లింప్స్
ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్లో తెరకెక్కుతున్న సినిమా దేవర. ఈ సినిమా ఏప్రిల్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. రీసెంట్గా వెకేషన్ కోసం విదేశాలకు వెళ్లిన ఎన్టీఆర్ మళ్లీ తిరిగి వచ్చాడు. ఈ సినిమాలో సైఫ్ అలీఖాన్ ఎన్టీఆర్ కు ప్రత్యర్థిగా నటిస్తున్నాడు.
ఇదిలా ఉంటే దేవర ప్రపంచాన్ని పరిచయం చేస్తూ ఓ గ్లింప్స్ ను మేకర్స్ రెడీ చేస్తున్నారు. ఈ గ్లింప్స్ ను జనవరి 8న రిలీజ్ చేయనున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. ఈ విషయాన్ని ఓ కొత్త పోస్టర్ ద్వారా అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. ఇన్ సైడ్ టాక్ ప్రకారం ఈ గ్లింప్స్ లో స్టోరీని రివీల్ చేయకుండా దేవర తిరిగే సముద్రాన్ని, గాఢతని, అలల మధ్య ఎదుర్కొనే ఆటుపోట్లను ఊహించిన దాని కంటే చాలా గొప్ప స్థాయిలో చూపించబోతున్నట్లు తెలిసింది.
ఈ గ్లింప్స్ లో ఎన్టీఆర్ కనిపించేది కొన్ని సెకన్లే అయినా ఆ కొద్ది సెకన్లు ఫ్యాన్స్ కు గూస్ బంప్స్ తెప్పించడం ఖాయమంటున్నారు. ఇవన్నీ వింటుంటే దేవర అంచనాలు అమాంతం పెరుగుతున్నాయి. ఓ వైపు షూటింగ్ జరుపుకుంటూనే మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుపుకుంటున్న ఈ సినిమాకు అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నాడు.













