NTR: ఎన్టీఆర్ డెసిషన్ కరెక్టే!
మూడు నెలల కిందట జరగాల్సిన దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్(Devara Pre Release Event) క్యాన్సిల్ చేసినప్పుడు ఫ్యాన్స్ మాటల్లో చెప్పలేనంత నిరాశకు గురయ్యారు. వాస్తవానికి రభస(Rabhasa) సినిమా టైమ్ లో ఓ ఫ్యాన్స్ రద్దీలో చనిపోవడంతో అప్పట్నుంచి ఎన్టీఆర్(NTR) ఓపెన్ గ్రౌండ్ ఈవెంట్స్ కు దూరంగా ఉంటూ వచ్చాడు. ఏదైనా బయటి సినిమాల ఈవెంట్ కు గెస్టుగా వెళ్లాడు తప్పించి తానైతే నో అవుట్ డోర్ ఈవెంట్ ఫార్ములా ఫాలో అయ్యాడు.
అందులో భాగంగానే నోవాటెల్(Novotel)లో క్యాన్సిల్ అయిన ఈవెంట్ ను బయట ఎక్కడైనా చేయమని ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ఎంత గోల చేసినా ఎన్టీఆర్ నిర్మొహమాటంగా నో అనేశాడు. కట్ చేస్తే తోపులాట తాలూకు విషయాల్లో ఎలాంటి చిన్న గొడవ జరిగినా తర్వాతి పరిణామాలు ఎంత దూరం తీసుకెళ్తాయో పుష్ప2(Pushpa2) విషయంలో ప్రూవ్ అయింది.
ఫ్యాన్స్ ఎంజాయ్మెంట్ ను డైరెక్ట్ గా చూడాలని బన్నీ(Bunny) తీసుకున్న డెసిషన్ తనని జైలు మెట్లు ఎక్కించింది. దేవరకు వచ్చిన జనాల్ని చూశాక ఒకవేళ అలాగే ఇరుకుగా ఈవెంట్ చేసి ఉంటే ఏదైనా జరగొచ్చనే భయమే తారక్(tarak) ను కఠినమైన డెసిషన్ తీసుకునేలా చేసింది. ఆ తర్వాత పుష్ప2 అంతకంటే పెద్ద ఈవెంట్స్ చేశారు. కానీ ఇలాంటి విషయాల్లో అసలు ఏ మాత్రం రిస్క్ తీసుకోకూడదనే తారక్ ఆలోచన ఇకమీదట కూడా మారదని అర్థం చేసుకోవచ్చు. అంతేకాదు తాను స్టూడింట్ నెం.1(Student No.1) నుంచి ఇప్పటివరకు ఏ సినిమానూ ఫ్యాన్స్ తో కలిసి చూడలేదని తారక్ ఆర్ఆర్ఆర్(RRR) ఇంటర్వ్యూల్లో వెల్లడించిన విషయం తెలిసిందే. దానికి కారణం ఇదే అయ్యుండొచ్చని ఇప్పుడందరూ తారక్ డెసిషన్ ను గౌరవిస్తున్నారు.













