ఎన్టీఆర్ కుమార్తె ఉమామహేశ్వరి హఠాన్మరణం
దివంగత మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్ నాలుగో కుమార్తె కంఠమనేని ఉమామహేశ్వరి హఠాన్మరణం చెందారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో ఇవాళ తుదిశ్వాస విడిచారు. ఉమామహేశ్వరి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఆమె మృతితో నందమూరి కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. ఉమామహేశ్వరి ఇంటికి నందమూరి, చంద్రబాబు కుటుంబ సభ్యులు చేరుకున్నారు. ఆమెకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. విదేశాల్లో ఉంటున్న పెద్ద కుమార్తెకు కుటుంబ సభ్యులు సమాచారం అందించారు. ఉమామహేశ్వరి అంత్యక్రియలు ఎల్లుండి జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.













