దేవర కోసం కొరటాల గట్టిగానే ప్లాన్ చేసినట్టున్నాడే!
ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని వెయిట్ చేసిన ఎన్టీఆర్30 ఫస్ట్ లుక్ ని ఎన్టీఆర్ బర్త్‌డే సందర్భంగా మేకర్స్ రిలీజ్ చేశారు. గత కొన్నాళ్లుగా ప్రచారంలో ఉన్న దేవర అనే టైటిల్ నే ఈ సినిమాకు ఫిక్స్ చేశారు. రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ లో ఎన్టీఆర్ సముద్రపు అలలు ఎగసి పడుతుండగా రాళ్ల గుట్టలపై నిల్చుని చేతిలో బల్లెంతో చుట్టూ తాను తెగనరికిన శవాలతో చాలా ఇంటెన్స్ గా కనిపిస్తున్నాడు.
ఎప్పటిలా కాకుండా బ్లాక్ కలర్ చొక్కా పంచెతో ఎన్టీఆర్ ఈ లుక్ లో అవతారమిచ్చాడు. ఎవరూ కూడా ఇలాంటి లుక్ ని ఎన్టీఆర్ నుంచి ఎక్స్పెక్ట్ చేయలేదు. దీన్ని బట్టి చూస్తుంటే అన్ని కమర్షియల్ సినిమాల్లా రెగ్యులర్ గా ఉండకుండా ఏదో సంథింగ్ స్పెషల్ ను ఫ్యాన్స్ కోసం కొరటాల ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది.
బ్యాక్ డ్రాప్ గురించి తప్ప ఎక్కడా ఎలాంటి క్లూ రివీల్ చేయకుండా, తన మీదున్న అంచనాలను దృష్టిలో పెట్టుకుని కొరటాల చాలా కేర్ తీసుకుని ఈ లుక్‌ని ఇలా డిజైన్ చేయించినట్లు తెలుస్తోంది. అరవింద సమేత తర్వాత ఎన్టీఆర్ సోలో హీరోగా వస్తున్న సినిమా ఇదే కావడంతో ఫ్యాన్స్ ఈ మూవీ కోసం, దీనికి సంబంధించిన అప్డేట్ల కోసం ఎంతగానో వెయిట్ చేస్తున్నారు.
పోస్టర్, గతంలో కొరటాల చెప్పిన మాటలను బట్టి చూస్తుంటే నిజంగానే కొరటాల ఈ సినిమా కోసం ఏదో పెద్దగానే ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో సైఫ్ అలీ ఖాన్ విలన్ గా నటిస్తున్నాడు. కాగా ఈ సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్ 5న రిలీజ్ కాబోతున్నట్లుగా చిత్ర బృందం పోస్టర్ ద్వారా తెలిపింది.













