NTR#30 సినిమా నుండి ఆలియా భట్ తప్పుకుందా? ఆమె స్థానంలో ఎవరై వుంటారబ్బా?
యంగ్ టైగర్ ఎన్టీఆర్, కొరటాల శివ దర్శకత్వంలో NTR#30 సినిమా రూపొందనున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో ఆలియా భట్‌ను హీరోయిన్గా అనుకున్నారు. అయితే రణ్ భీర్తో పెళ్లి తర్వాత ఆమె తప్పుకుందని టాక్ వినిపిస్తోంది. ఆ ఛాన్స్‌ను మరో బ్యూటీ కొట్టేసిందట. ఆమె ఎవరంటే.. ఈ కాంబోలో తెరకెక్కనున్న చిత్ర కథపై రక రకాల వార్తలు వినిపిస్తున్నాయి. ఏదేమైనా ప్రాజెక్ట్ మాత్రం పాన్ ఇండియా రేంజ్లో ఉంటుందని అంటున్నారు. ఎన్.టి.ఆర్ ఆర్ట్స్, యువ సుధ ఆర్ట్స్ పతాకాలపై ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఇక ఇప్పటికే ఇందులో ఎన్.టి.ఆర్ సరసన బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్ నటిస్తుందని ప్రచారం జరిగింది. ఈ విషయాన్ని ఆలియా కూడా ఆ మధ్య ముంబై మీడియా సమావేశంలో హింట్ ఇచ్చింది.
అయితే, తాజా సమాచారం మేరకు NTR#30 నుంచి ఆలియా తప్పుకుందట. దీనికి కారణం ఇటీవల ఆలియా పెళ్ళి చేసుకుంది..కొంత కాలం సినిమాలకు గ్యాప్ ఇవ్వాలనుకోవడమేనట. ఇది అఫీషియల్ అవునో కాదో తెలీదు గానీ, ప్రస్తుతం సోషల్ మీడియాలో మాత్రం ఈ వార్త చక్కర్లు కొడుతోంది. అంతేకాదు, ఆలియా భట్ తప్పుకోవడంతో ఆ ఛాన్స్ ఇప్పుడు రష్మిక మందన్నకు దక్కినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం తెలుగుతో పాటు హిందీలో కూడా వరుసగా క్రేజీ ఆఫర్ అందుకుంటోంది. ఈ క్రమంలోనే ఇప్పుడు ఎన్.టి.ఆర్ – కొరటాల శివ కాంబినేషన్లో రూపొందనున్న సినిమాలోనూ ఛాన్స్ దక్కించుకుందని తెలుస్తోంది.













