ఆ విషయంలో ప్రభాస్ తర్వాత ఎన్టీఆరే!
ఆర్ఆర్ఆర్ తర్వాత ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ఎన్టీఆర్, తన తర్వాతి సినిమాను కొరటాల శివతో చేస్తున్న సంగతి తెలిసిందే. దేవర టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా రెండు భాగాలుగా రానున్నట్లు కొరటాల శివ ఇప్పటికే క్లారిటీ ఇచ్చాడు. ఈ సినిమా కోసం ఏకంగా రూ.300 కోట్ల బడ్జెట్‌ను పెడుతున్నట్లు సమాచారం.
ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ బాలీవుడ్ లో హృతిక్ రోషన్ తో కలిసి వార్2లో నటించబోతున్నాడు. వార్2లో ఎన్టీఆర్ నెగిటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ లో కనిపించనున్నాడని వార్తలొస్తున్నాయి. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. యష్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్లో రూపొందుతున్న ఈ సినిమా దాదాపు రూ. 500 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతుంది.
ఇక వార్2 తర్వాత ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ లో ఓ సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన అనౌన్స్మెంట్ కూడా వచ్చేసింది. ఈ సినిమాను మైత్రీ బ్యానర్ రూ.400 కోట్లతో రెండు భాగాలుగా నిర్మించనున్నట్లు తెలుస్తోంది. ఎన్టీఆర్ నటిస్తున్న ఈ మూడు సినిమాల బడ్జెట్ రూ.1200 కోట్లు. దీన్ని బట్టి చూసుకుంటే ప్రస్తుతం సౌత్ లో ప్రభాస్ తర్వాత అత్యధిక బడ్జెట్ తో సినిమాలు చేస్తున్న హీరోగా ఎన్టీఆర్ పేరే ఉంది.













