War2: వార్2 లో ఎన్టీఆర్ పాత్రపై క్రేజీ అప్డేట్

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్(NTR) ఇప్పుడు పలు క్రేజీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడు. దేవర(Devara)తో సూపర్ హిట్ అందుకున్న ఎన్టీఆర్, ప్రస్తుతం వార్2(War2), ప్రశాంత్ నీల్(Prasanth Neel) తో కలిసి డ్రాగన్(Dragon) సినిమాల్లో నటిస్తున్నాడు. వార్2 షూటింగ్ ఇప్పటికే పూర్తైపోయింది. ఆగస్ట్ 14న ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. వార్2 సినిమాతో ఎన్టీఆర్ బాలీవుడ్ కు పరిచయం కానున్నాడు.
హృతిక్ రోషన్(Hrithik Roshan), ఎన్టీఆర్ మొదటి సారి కలిసి చేస్తున్న సినిమా అవడంతో ఈ సినిమాపై అందరికీ భారీ అంచనాలున్నాయి. అయాన్ ముఖర్జీ(Ayaan Mukharjee) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో తారక్ ఎలా కనిపిస్తాడనే విషయంలో రీసెంట్ గా వచ్చిన టీజర్ తో ఓ క్లారిటీ వచ్చింది. ఇదిలా ఉంటే ఈ సినిమాలో ఎన్టీఆర్ క్యారెక్టర్ పై ఇంట్రెస్టింగ్ రూమర్ వినిపిస్తుంది.
వార్2 లో తారక్ కూడా ఓ స్పై ఏజెంట్ గా నటించనుండగా, తాను ఇండియా నుంచి దారి తప్పిన కబీర్ ను ఎదుర్కొనే సమానమైన పవర్‌ఫుల్ ఏజెంట్ విక్రమ్ గా తెలుస్తోంది. గతంలో ఎన్టీఆర్ ఏజెంట్ వీరేంద్ర రఘునాథ్ గా కనిపిస్తాడని టాక్ వినిపిస్తుంది కానీ ఇప్పుడు ఏజెంట్ విక్రమ్ పాత్రలో ఎన్టీఆర్ కనిపించనున్నాడని అంటున్నారు. మరి ఈ వార్తల్లో ఏ మేర నిజముందనేది తెలియాల్సి ఉంది. యష్ రాజ్ ఫిల్మ్స్(Yash Raj Films) నిర్మిస్తున్న ఈ సినిమాలో కియారా అద్వానీ(Kiara Advani) హీరోయిన్ గా నటిస్తోంది.