ఎన్టీఆర్ వద్దన్నదే మహేష్ చేశాడా?
సూపర్ స్టార్ మహేష్ బాబు, త్రివిక్రమ్ కలయికలో వచ్చిన గుంటూరు కారం సినిమా మిక్డ్స్ టాక్ తో మంచి కలెక్షన్స్ ను రాబడుతుంది. మహేష్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ తెచ్చిన ఈ సినిమా కంటెంట్ విషయంలో మాత్రం ఫ్యాన్స్ అంతగా సంతృప్తి చెందలేదు. మహేష్ బాబు తప్ప సినిమాలో మరేమీ లేదని అందరూ పెదవి విరుస్తున్నారు.
ప్రస్తుతం ఈ సినిమా గురించి నెట్టింట ఓ టాక్ వైరలవుతోంది. మహేష్ నటించిన గుంటూరు కారం సినిమాను ముందుగా ఓ ప్రముఖ హీరో రిజెక్ట్ చేసినట్లు చెప్తున్నారు. అల వైకుంఠపురములో సినిమా తర్వాత త్రివిక్రమ్, ఎన్టీఆర్ తో సినిమా చేయనున్నట్లు అధికారికంగా అనౌన్స్మెంట్ కూడా వచ్చింది. కానీ కొన్ని కారణాల వల్ల ఆ సినిమా ఆగిపోయింది.
దీంతో త్రివిక్రమ్, మహేష్ తో కలిసి సెట్స్ పైకి వెళ్లి గుంటూరు కారం చేశాడు. ఇప్పుడు మహేష్ తో చేసిన గుంటూరు కారం స్టోరీనే త్రివిక్రమ్, ఎన్టీఆర్ కు చెప్పగా కథ నచ్చకపోవడం వల్లే ఎన్టీఆర్ ఆ సినిమాను క్యాన్సిల్ చేసినట్లు నెట్టింట కథలు అల్లుతున్నారు. ఇందులో నిజమెంతున్నది తెలియాలంటే చిత్ర యూనిట్ లో ఎవరొకరు స్పందించాలి కానీ ఆ ఛాన్స్ ఇకపై ఉండకపోవచ్చు.













