ఎన్టీఆర్ మరో ఘనత…. తెలుగు ఇండస్ట్రీ నుంచి
ఆర్ఆర్ఆర్తో అంతర్జాతీయ స్థాయిలో అభిమానులకు సొంతం చేసుకున్న హీరో ఎన్టీఆర్ తాజాగా మరో ఘనతను సాధించారు. 2023లో ఆసియాలో టాప్ 50లో నిలిచిన నటుల జాబితాను ఏషియన్ వీక్లీ మ్యాగజైన్ ప్రకటించింది. అందులో తారక్ స్థానం దక్కించుకున్నారు. ఈస్టర్న్ ఐ 2023 పేరిట ఈ జాబితాను వెల్లడించగా ఎన్టీఆర్ 25వ స్థానంలో నిలిచారు. ఈ జాబితాలో తెలుగు ఇండస్ట్రీ నుంచి స్థానం దక్కించుకున్న ఏకైక హీరో తారక్ కావడం విశేషం. ఇక లిస్ట్‌లో షారుక్ మొదటి స్థానంలో, నిలవగా పలువురు బాలీవుడ్ నటీనటులు చోటు దక్కించుకున్నారు. ఇటీవల అమెరికన్ మ్యాగజైన్ వెరైటీ ప్రకటించిన 500 మంది అత్యంత ప్రభావశీలుర జాబితాలో ఎన్టీఆర్, రాజమౌళి చోటు దక్కించుకున్నారు.













