దేవర రిలీజ్ కాగానే ఆ సినిమా స్టార్ట్
కొరటాల శివతో ఎన్టీఆర్ చేస్తున్న దేవర సినిమా రెండు భాగాలుగా రిలీజ్ కానుందని అనౌన్స్ చేశాక ఫ్యాన్స్ లో చాలానే డౌట్స్ తలెత్తాయి. దేవర మొదటి భాగం షూటింగ్ నవంబర్ లోపు పూర్తి చేసుకుని, డిసెంబర్ తర్వాత వార్2 షూటింగ్ లో పాల్గొననున్నాడు ఎన్టీఆర్. మరి దేవర2 ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? ప్రశాంత్ నీల్ సినిమా ఎప్పుడు మొదలవుతుందని అందరూ టెన్షన్ పడ్డారు.
ఈ అనుమానాలన్నింటికీ తెర దించుతూ మైత్రీ మూవీ మేకర్స్ ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ సినిమా 2024 ఏప్రిల్ నుంచి మొదలవుతుందని అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. ఈ సినిమా కొత్త బెంచ్ మార్క్ సెట్ చేసేలా, ఎవరి ఊహలకు అందని రీతిలో ఉంటుందని చెప్పారు. దీంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ లో కాస్త ఊరట లభించింది.
నీల్, ఎన్టీఆర్ సినిమా సమ్మర్లోనే మొదలవుతుంది. అంటే దేవర సినిమా రిలీజ్ అయిన వెంటనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లే ఛాన్సులు ఎక్కువ కనిపిస్తున్నాయి. దేవర తర్వాత వార్2 షూటింగ్ పూర్తి చేసుకుని ఆ తర్వాత ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ తో సెట్స్ పైకి వెళ్లబోతున్నాడు. ప్రశాంత్ నీల్ సినిమా అయిపోయే టైమ్ లో దేవర2 ని సెట్స్ పైకి తీసుకెళ్లేలా చూస్తున్నాడట ఎన్టీఆర్. ఇకపై తన నుంచి ఏడాదికి ఒక సినిమా అయినా ఉండాలనే ఉద్దేశంతో ఎన్టీఆర్ తన కెరీర్ ను ప్లాన్ చేసుకుంటున్నాడని సమాచారం.













