ఎన్టీఆర్- ప్రశాంత్ నీల్ మూవీ మొదలప్పుడే!
ఆర్ఆర్ఆర్ తర్వాత ప్రస్తుతం ఎన్టీఆర్, కొరటాల శివతో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ సినిమాను చెప్పినట్లే ఏప్రిల్ 5కు రిలీజ్ చేయాలని చాలా కసిగా షూట్ చేస్తున్నారు మేకర్స్. ఇదిలా ఉంటే ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ తో సినిమా చేయనున్న సంగతి తెలిసిందే.
అయితే ఆ సినిమా ఎప్పుడు స్టార్ట్ అవుతుందనే దానిపై మాత్రం క్లారిటీ లేదు. తాజాగా ఈ ప్రాజెక్ట్ పై ప్రశాంత్ నీల్ క్లారిటీ ఇచ్చారు. తారక్ తో తన సినిమా వచ్చే సంవత్సరం ఏప్రిల్ లేదా మే నుంచి స్టార్ట్ అవుతుందని వెల్లడించాడు. అంటే దేవర రిలీజ్ తర్వాత ఈ కాంబోలో సినిమా సెట్స్ మీదకు వెళ్లనుందని ప్రశాంత్ నీల్ అఫీషియల్ గా క్లారిటీ ఇచ్చినట్లే.
ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు ప్రశాంత్ నీల్ కాంబోలో రానున్న సినిమాపై చాలా భారీ అంచనాలున్నాయి. ఈలోపు రానున్న సలార్ సినిమా మంచి హిట్ అయితే మాత్రం ఎన్టీఆర్31 హైప్ పీక్స్ కు వెళ్లడం ఖాయం. ఇప్పటికే ఎన్టీఆర్ను ప్రశాంత్ నీల్ ఎలా చూపించబోతున్నాడు? ఎలాంటి కథతో ప్రేక్షకుల ముందుకు రానున్నారని చాలా ఆసక్తి నెలకొంది. సినిమా సెట్స పైకి వెళ్తే కానీ కథ విషయంలో ఓ క్లారిటీ రాదు.













