ఆ విషయంలో ఎన్టీఆర్ ను మెచ్చుకోవాల్సిందే
సినీ ఇండస్ట్రీలో ఏదైనా పెద్ద ఫ్యామిలీ నుంచి ఓ హీరో వస్తున్నాడంటే ఆ ఫ్యామిలీలో ఆల్రెడీ సెటిల్ అయిన సెలబ్రిటీ ఒకరు వచ్చి అతణ్ని ప్రమోట్ చేయడం చాలా కామన్. కానీ జూ. ఎన్టీఆర్ మాత్రం తన బావమరిది నార్నె నితిన్ ను ప్రమోట్ చేయడానికి మాత్రం ఇప్పటివరకు కెమెరా ముందుకు రాలేదు. నితిన్ ఫస్ట్ మూవీ మ్యూడ్ రిలీజ్ టైమ్ లో కూడా ఎన్టీఆర్ తన బావమరిది గురించి వీడియో బైట్ ఇచ్చింది లేదు. ఇప్పుడు గీతా ఆర్ట్స్ బ్యానర్ లో ఆయ్ అనే సినిమా చేస్తున్నాడు నార్నె నితిన్. ఈ సినిమాను కూడా ఎన్టీఆర్ ప్రమోట్ చేయడం లేదు. ఆఫ్ స్క్రీన్ లో సినిమాలను సెట్ చేయిస్తున్నాడేమో కానీ బహిర్గతంగా మాత్రం నితిన్ ను ఎన్టీఆర్ ఎక్కడా ప్రమోట్ చేయడం లేదు. ఆయ్ సినిమాకు సంబంధించిన విషయంలో కూడా ఎన్టీఆర్ ఏ మాత్రం జోక్యం చేసుకోలేదని నిర్మాత అల్లు అరవింద్ తెలిపారు.
ఆయ్ సినిమా కథ, నితిన్ క్యారెక్టరైజేషన్ గురించి ఎన్టీఆర్ తో మాట్లాడాలని ట్రై చేసినా, తన మీద నమ్మకంతో అన్నీ తారక్ తమకే వదిలేసినట్లు చెప్పాడు. సినీ ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరోలకు ఫస్ట్ మూవీ వరకే పుష్ చేయగలమని, తర్వాత వాళ్ల టాలెంట్ తోనే నెట్టుకురావాలని, నితిన్ విషయంలో కూడా తారక్ అదే ఆశిస్తున్ననట్లు తనతో చెప్పాడని అరవింద్ వెల్లడించాడు. ఏదైనా ఈ విషయంలో ఎన్టీఆర్ ను మెచ్చుకోవాల్సిందే.













