ఆ డైరెక్టర్ తో ఎన్టీఆర్ మూవీ?
అరవింద సమేత సినిమా తర్వాత ఎన్టీఆర్ సోలోగా సినిమా వచ్చింది లేదు. ఆర్ఆర్ఆర్ రూపంలో గొప్ప బ్లాక్ బస్టర్ అందుకున్నప్పటికీ ఆ సినిమా మల్టీస్టారర్ కావడంతో ఎన్టీఆర్ నుంచి సోలో సినిమా ఎప్పుడెప్పుడొస్తుందా అని అందరూ వెయిట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఫ్యాన్స్ కళ్లన్నీ కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ నటిస్తున్న దేవర మీదే ఉన్నాయి.
సెప్టెంబర్ 27న దేవర ప్రేక్షకుల ముందుకు రానుంది. రెండు భాగాలుగా రానున్న ఈ సినిమాకు మంచి బిజినెస్ జరుగుతుంది. దీంతో పాటూ ఎన్టీఆర్ హృతిక్ రోషన్ తో కలిసి వార్2 సినిమా కూడా చేస్తున్నాడు. వీటి గురించి కాసేపు పక్కన పెడితే ఎన్టీఆర్, హాయ్ నాన్న డైరెక్టర్ శౌర్యువ్ తో రెండు భాగాల యాక్షన్ డ్రామాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడనే వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది.
అఫీషియల్ గా ఇంకా ఎలాంటి కన్ఫర్మేషన్ లేదు కానీ లీక్స్ మాత్రం బాగా వినిపిస్తున్నాయి. అయితే ఎన్టీఆర్ ఈ సినిమా చేయాలంటే ముందుగా దేవర2 పూర్తి చేయాలి. ఆ తర్వాత ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చే సినిమాను కూడా పూర్తి చేయాలి. ఇవి పూర్తవడానికి ఎంత లేదన్నా రెండేళ్లు పట్టొచ్చు. వార్2 కాకుండా యష్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్ లో ఓ సినిమాకు తారక్ యస్ చెప్పాడని టాక్. ఇవన్నీ అయిపోయి శౌర్యువ్ సినిమా చేయాలంటే ఎంత లేదన్నా 2027 వస్తుంది.













