22న మహా నాయకుడు విడుదల
నందమూరి బాలకృష్ణ విద్యా బాలన్ జంటగా నటించిన సినిమా ఎన్టీఆర్ మహానాయకుడు.. ఎన్టీఆర్ బయోపిక్‌లో రెండో భాగంగా వస్తున్న ఎన్టీఆర్ మహా నాయకుడు సెన్సార్ పూర్తిచేసుకుంది. సెన్సార్ బోర్డు నుంచి క్లీన్ యు సరిఫికెట్ అందుకుంది. ఈ చిత్రం ఈనెల 22న విడుదల కాబోతోంది. భారీ అంచనాల మధ్య ప్రపంచ వ్యాప్తంగా ఎన్టీఆర్ మహానాయకుడు సినిమా విడుదల కానుంది. ఎన్టీఆర్ రాజకీయ జీవితం నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కింది. నందమూరి కల్యాణ్ రామ్, రానా, సుమంత్ ఈ చిత్రంలో ప్రధానపాత్రల్లో నటించారు. క్రిష్ జాగర్ల మూడి తెరకెక్కించారు. ఎంఎం కీరవాణి సంగీతం అందించారు. బాలకృష్ణ, ఎన్బికె ఫిల్మ్స్ బ్యానర్‌పై ఎన్టీఆర్ సినిమాను నిర్మించారు.













