ఫిబ్రవరి 14న మహానాయకుడు?
ఎన్.టి.రామారావు జీవిత చరిత్ర ఆధారంగా ఆయన తనయుడు బాలకృష్ణ టైటిల్ పాత్ర పోషిస్తూ ..క్రిష్ దర్శకత్వంలో నిర్మిస్తున్న రెండు భాగాలలో మొదటిభాగం ఎన్.టి.ఆర్ కథానాయకుడు ఇటీవల విడుదలైన సంగతి తెలిసిందే. కాగా ఎన్.టి.ఆర్ రాజకీయ జీవితానికి సంబంధించిన అంశాలతో తెరకెక్కిస్తున్న రెండో భాగం మహానాయకుడు చిత్రాన్ని ఫిబ్రవరి 7న విడుదల చేస్తున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. అయితే ఇప్పటివరకు మొదటిభాగం ప్రమోషన్‌కే సమయం సరిపోయింది. అదీకాకుండా రెండోభాగం షూటింగ్ పదిరోజుల పాటు మిగిలివుండటం తదితర కారణాలతో ఫిబ్రవరి 14న మహానాయుడు చిత్రాన్ని విడుదల చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలిసింది. ఎన్.టి.ఆర్ రాజకీయకోణంలో రెండోభాగం రూపుదిద్దుకోవడంతో దానిపై ప్రేక్షకాభిమానులు ఎన్నో అంచనాలతో ఉన్నారు.













