నెక్ట్స్ లెవెల్లో కొరటాల యాక్షన్
ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమా దేవర. ఈ సినిమా రెండు భాగాలుగా రానున్న విషయం తెలిసిందే. దేవర మొదటి భాగంగ ఏప్రిల్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. సముద్రం బ్యాక్ డ్రాప్ లో సాగే స్టోరీ నుంచి ఇప్పటికే రిలీజ్ అయిన ప్రతీ కంటెంట్ సినిమాపై అంచనాలను రెట్టింపు చేస్తున్నాయి.
దేవరలో కొరటాల ఇంతకు ముందెన్నడూ చూడని ఎన్టీఆర్ సరికొత్తగా ప్రజెంట్ చేయనున్నాడట. ఈ కథను కొరటాల ఎన్నో జాగ్రత్తలు తీసుకుని మరీ రెడీ చేశాడు. ఈ సినిమా కథ ఎలా ఉంటుందో ఇప్పటికే కొరటాల చెప్పాడు. దేవర కథలో మనుషుల కంటే మృగాలే ఎక్కువుంటాయని, వాటికి భయం తెలియదని , దేవుడన్నా, ఆఖరికి చావన్నా భయంలేదు కానీ ఎన్టీఆర్ పాత్రకు మాత్రం ఆ మృగాలు భయపడతాయని కొరటాల చెప్పాడు.
ఇప్పటివరకు సెన్సిబుల్ కథల్నే చెప్పిన కొరటాల మొదటి సారి దేవరలో అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ను చూపించబోతున్నట్లు తెలుస్తోంది. దేవరలో ప్రతీ పాత్ర ఎంతో హైలైట్ కానుందని సమాచారం. భయం తెలియని మృగాలు దేవరకు ఎందుకు భయపడతాయి? అసలు ఆ భయాన్ని ఎలా పరిచయం చేస్తాడన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది.













