నభూతో నభవిష్యతి ‘ఎన్.టి.ఆర్’ కథానాయకుడు, మహానాయకుడు
ఈ విశ్వం వున్నంతవరకు ప్రపంచ వ్యాప్తంగా వున్నా తెలుగువారు విశ్వవిఖ్యాత నటసార్వభౌమ, నటరత్న, పద్మశ్రీ, డాక్టర్, స్వర్గీయ ‘నందమూరి తారక రామారావు (‘ఎన్.టి.ఆర్’) అనే మూడక్షరాలను మరువరు మరవలేరు. ఆలాంటి కథానాయకుడు, మహానాయకుడు బయోపిక్ ని ఎన్.టి.ఆర్ నటవారసుడు నందమూరి బాలకృష్ణ తన తండ్రి పాత్రను పోషిస్తూ ఎన్ బి కె ఫిలిం, పతాకం పై నిర్మిస్తున్నాడు. వరాహీ చలన చిత్ర , మరియు వైబ్రి మీడియా బ్యానర్లు పై సాయి కొర్రపతి రంగనాథ మరియు విష్ణు ఇందూరి సహా నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. బాలకృష్ణ తో గౌతమి పుత్ర శాతకర్ణి కి దర్శకత్వం వహించిన క్రిష్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇటీవల జరిగిన ఆడియో ఫంక్షన్ లో విడుదల చేసిన థియేట్రికల్ ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది ఎన్.టి.ఆర్ జీవిత చరిత్ర సంపూర్ణం గా చూపించడం కేవలం మూడు ఘంటలలో సరిపోదు. అందుకనే ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా విడుదల చేయటానికి నిర్ణయించారు. సంక్రాంతి కానుకగా జనవరి 9 న ‘ఎన్.టి.ఆర్’ కథానాయకుడు, ఫిబ్రవరి 7 న ‘ఎన్.టి.ఆర్’ మహానాయకుడు చిత్రాలను తెలుగు, తమిళ్, హిందీ భాషలలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. .
ఎన్. టి. ఆర్. ఎన్నో పౌరాణిక, జానపద, చారిత్రాత్మక, సాంఘీక చిత్రాలలో నటించటమే కాక, రాజు పేదా, కుంటి గుడ్డి అనే తేడా లేకుండా ఆయా పాత్రలలో జీవించి, తన దివ్య మోహన రూపంతో ఎందరికో స్పూర్తి నిచ్చారు. అప్పటివరకూ ఎం యల్ ఏ., యంపీ, సి యమ్, పి యమ్ గవర్నర్ మరియూ రాష్ట్రపతి లాంటి రాజకీయ పదవుల్లోని తేడాపై ధ్యాసే పెట్టని మహా నటుడు ఎన్ టి ఆర్. ఎం జి ఆర్ సూర్తితో.. ‘తెలుగు’ ప్రజానీకానికి, తనకున్న తిరుగులేని జనాకర్షణ శక్తితో ఆత్మీయ ‘అన్న’గా దగ్గరై, ప్రజల్లో ‘రాజకీయ చైతన్యం’ తీసుకురావటమే కాక, ‘ఆత్మగౌరవం’ నినాదంతో, అప్పటివరకూ ‘మదరాసీ’లుగా పిలువబడుతున్న ‘తెలుగు జాతి’కీ, ‘తెలుగు భాష’కీ ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేకమైన గుర్తింపునీ తెచ్చారు. ఆయన తన తెలుగు దేశం పార్టీ పరిపాలనలో తీసుకున్న సంచలనాత్మక, విప్లవాత్మక నిర్ణయాలు మరియూ సంక్షేమ పధకాలు ఇప్పటికీ ఎందరో రాజకీయవేత్తలకు మార్గదర్శకంగా నిలుస్తున్నాయి.
‘కా’రణ’జన్ములు’, ‘యుగపురుషులు’ ఎప్పుడూ సందేశాలు ఇవ్వరు. కానీ, తమ తమ జీవనవిధానాల ద్వారా మనకి స్పూర్తినిచ్చే ఆశయాలని, మన మధ్య వదిలి ‘భువి’ నుండీ ‘దివి’కి పయనమవుతారు. అలా ఆయన వదిలిన ఆశయాలలో ముచ్చటగా మూడు..
ఏ పనినైనా ‘అంకితభావం’తో చేయడం..
ఆ పని ఎంత ‘కష్టమైనా ఇష్టపడి’ చేయటం..
ఆ పనిని సాధించటంలో ‘మడమ తిప్పకుండా పోరాటం’ చెయ్యటం..
ఇక్కడ ‘అమలాపురం’లోని ‘రిక్షాపుల్లర్’ నుండి, ఎక్కడో ‘అమెరికా’లో ఉంటున్న ‘సాఫ్ట్వేర్ ఇంజనీర్’ వరకూ, ప్రపంచవ్యాప్తంగా.. కుల, మత, ప్రాంతాలకు అతీతంగా, వివిధ రంగాలలో ఉన్న, ఎంతో మంది ‘తెలుగు’ వాళ్ళకు, ఆయన తన ఆశయాల ద్వారా స్పూర్తినిచ్చారు. అంతే కాకుండా హైందవ సంప్రదాయాలకు ప్రతీకలుగా నిలచిన ‘మహాభారతం’, ‘భాగవతం’, ‘రామాయణం’లోని పాత్రలకు తన సినిమాల ద్వారా సజీవ రూపకల్పన చేసి, ప్రతి పాత్రలో జీవించాడు. మన కళ్ళముందు కదలాడారు. తన 60 ఏళ్ళ వయస్సులో, ఆ రోజుల్లో మన ‘తెలుగు’నాట ఉన్న గతుకుల రోడ్లల్లో, ‘చైతన్యరధం’ పైభాగానే కూర్చొని తిరుగుతూ, ప్రతీ కిలోమీటరుకూ వేలాదిగా, లక్షలాదిగా ప్రజల్ని ఆకర్షిస్తూ, ‘చైతన్యరధం’ పైనే నిలబడి తన ప్రసంగాల ద్వారా వాళ్ళల్లో ఉత్తేజాన్ని, ఉద్వేగాన్ని నింపారు. పార్టీ పెట్టి కేవలం 9 నెలలలో ఆంధ్ర ప్రదేశ్ సార్వభౌమాధికారాన్ని దక్కించుకున్నారు. భావితరాల వాళ్ళు ‘మానవమాత్రులకు ఇంతటి జనాకర్షణశక్తి సాధ్యమా’ అని కలలో కూడా ఊహించుకోలేనటువంటి అసాధ్యాలను సుసాధ్యాలుగా మలుస్తూ ఒక ‘కా’రణ’జన్ముడి’లా, ‘యుగపురుషుడి’లా, ఓ ‘దైవం’లా అవతరించారు.
ఈ చిత్రంలో ఏ నటి నటులు ఏ పాత్రలు పోషిస్తున్నారో చూద్దాం నందమూరి తారక రామారావు : బాలకృష్ణ, శ్రీమతి నందమూరి బసవ రామ తారకం : విద్యా బాలన్, నందమూరి త్రివిక్రమరావు, :దగ్గుబాటి రాజా, నందమూరి హరికృష్ణ : కల్యాణ్ రామ్, లోకేశ్వరి : పూనమ్ బజ్వా, భువనేశ్వరి : మంజిమా మోహన్, .సాయి కృష్ణ : గారపాటి శ్రీనివాస్, పురంధేశ్వరి : హిమన్సీ, ఉమా మహేశ్వరి : హీరోషిని కోమలి, నందమూరి రామకృష్ణ : రోహిత్ భరద్వాజ్., అక్కినేని నాగేశ్వరరావు : సుమంత్, రామోజీరావు : గిరీష్,ఎస్వీ రంగారావు, : ఈశ్వర్ బాబు,నారా చంద్రబాబు నాయుడు : దగ్గుబాటి రానా, మండలి వెంకట కృష్ణా రావు : మండలి బుధప్రసాద్.హెచ్ ఎం రెడ్డి : కైకాల సత్యనారాయణ, దాసరి నారాయణ రావు : చంద్ర సిద్ధార్థ్., రేలంగి : బ్రహ్మానందం, నాగిరెడ్డి : ప్రకాష్ రాజ్ ఆలూరి చక్రపాణి : మురళీ శర్మ, ఎల్వి ప్రసాద్ : జిషు సేనుగుప్త, శ్రీదేవి : రకుల్ ప్రీత్ సింగ్, నాదెండ్ల భాస్కరరావు : సచిన్ ఖేదేకర్, బి ఏ సుబ్బారావు : నరేష్, పీ పుల్లయ్య : శుభలేఖ సుధాకర్, కే వీ రెడ్డి : క్రిష్ జాగర్లమూడి, పీతాంబరం : సాయి మాధవ్ బుర్రా, బి విఠలాచార్య : ఎన్ శంకర్, కృష్ణ కుమారి : ప్రణీత శుభాస్, వెంపటి చిన సత్యం : శివ శంకర మాస్టర్, సావిత్రి : నిత్యామీనన్, జయప్రద : హన్సిక మోత్వాని, ప్రభ : శ్రీయ, జయసుధ : పాయల్ రాజపుత్, యోగానంద్ : రవిప్రకాష్, తాతినేని ప్రకాష్ రావు : ఇంటూరి వాసు, టీ వెంకటరాజు : సురభి జయ చంద్ర, పేకేటి శివరాం : భద్రం, షావుకారు జానకి : షాలిని పాండే, పింగళి : సంజయ్, మార్కస్ బార్ట్లే : అర్జున ప్రసాద్, గుమ్మడి : దేవీ ప్రసాద్, జీ వరలక్ష్మీ : ప్రత్యూష, పుండరీకాక్షయ్య : నాగేశ్వరరావు, కమలాకర్ కామేశ్వర రావు : ఎస్వీ కృష్ణారెడ్డి, ఇందిరాగాంధీ : సుప్రియా వినోద్, సీ నారాయణరెడ్డి : రామజోగయ్య, శాస్ట్రీ, ఎమ్ జి రామచంద్రన్ : సికిందర్, కన్నప్ప : సునీల్ కుమార్ రెడ్డి, డీ వీ నరసరాజు : శ్రీనివాస్ అవసరాల,కె రాఘవేంద్రరావు : కె ప్రకాష్, సలీం మాస్టర్ : రఘు మాస్టర్, దగ్గుపాటి వెంకటేశ్వరరావు : భరత్ రెడ్డి, చల్మేశ్వర్ రావు : నాగరాజ్, రూఖ్మాంగధ రావు : వెన్నెల కిషోర్
భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ చిత్రం బ్యానెర్లు ;ఎన్ బి కె ఫిలిం, వరాహీ చలన చిత్ర , మరియు వైబ్రి మీడియా, సినిమాటోగ్రఫీ:జ్ఞాన శేఖర్ వి యస్, ఎడిటర్: అర్రం రామకృష్ణ, సంగీతం: యం యం కీరవాణి, పాటలు: సిరివెన్నెల, కె శివ దత్త, డా.కె రామకృష్ణ, యం యం కీరవాణి,మాటలు :సాయి మాధవ్ బుర్ర, కార్యనిర్వాహక నిర్మాత: యం ఆర్ వి ప్రసాద్, సహా నిర్మాతలు : సాయి కొర్రపాటి, విష్ణు ఇందూరి, నిర్మాత:నందమూరి బాల కృష్ణ, స్క్రీన్-ప్లే, దర్శకత్వం:క్రిష్.













