సలార్2 వెనక్కి.. ఎన్టీఆర్ సినిమా ముందుకి
సలార్ పార్ట్ 1 తర్వాత డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఎవరితో సినిమా చేస్తాడనేది అర్థం కాక ఆడియన్స్ కొన్ని రోజుల నుంచి అయోమయంలో ఉన్నారు. మొత్తానికి ఇప్పుడా ఆలోచనలకు తెర పడింది. సలార్ 2 కంటే ముందు ఎన్టీఆర్ తో సినిమా చేయాలని నీల్ డిసైడైనట్లు ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా అనౌన్స్ చేసిన పోస్టర్ ద్వారా అర్థమైంది. ఈ సినిమాకు టైటిల్ చెప్పకపోయినా సినిమా షూటింగ్ ఆగస్ట్ నుంచి స్టార్ట్ అవుతుందని క్లారిటీ ఇచ్చారు.
అయితే దేవర పార్ట్1 నుంచి ఎన్టీఆర్ జులై లోపు ఫ్రీ అవుతాడు కాబట్టి ప్రశాంత్ నీల్ తన సినిమాను ఆగస్ట్ నుంచి మొదలుపెడదామనుకుని ఉంటాడు. కానీ జూ.ఎన్టీఆర్ మరోవైపు వార్2 సినిమా కూడా చేస్తున్నాడు. ఆ సినిమా షూటింగ్ డిసెంబర్ లోపు పూర్తి చేసి ఆ తర్వాత బల్క్ డేట్స్ నీల్ కు ఇచ్చేలా తారక్ ప్లాన్ చేసుకున్నాడట. మరి దేవర2 ఎప్పుడు సెట్స్ పైకి వెళ్తుందనేది మరో ప్రశ్న.
అయితే దేవర పార్ట్ 1 తో పాటే రెండో పార్ట్ ను కూడా సమాంతరంగా షూట్ చేస్తున్నారని కొందరంటున్నారు కానీ అందులో నిజమెంతన్నది డైరెక్టర్ కొరటాల చెప్తే తప్ప నమ్మలేం. ఒకవేళ అది నిజం కాకపోతే నీల్ సినిమా అయిపోగానే దేవర2ను ఎన్టీఆర్ సెట్స్ పైకి తీసుకెళ్లే ఛాన్సుంది. మరోవైపు నీల్- ఎన్టీఆర్ సినిమా పూర్తయ్యే లోపు ప్రభాస్ కూడా తన కమిట్మెంట్స్ ను పూర్తి చేసుకుని సలార్2 కోసం రెడీ అవుతాడు. .













