ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు షాకిచ్చిన కోహ్లీ
బాలీవుడ్ హీరోలకు ఇండియన్ క్రికెటర్లకు మధ్య మంచి అనుబంధమే ఉంటుంది. సెలబ్రిటీల పార్టీలకు, పెళ్లిలకు క్రికెటర్స్ వెళ్లడం మనం రెగ్యులర్ గా చూస్తూనే ఉంటాం. అలా వేరే భాషల హీరోలతో క్రికెటర్లకు ర్యాపో ఉండదు. ముంబై వాణిజ్య రాజధాని కావడం కూడా ఒక కారణం. ముంబైతో క్రికెటర్ల అసోసియేషన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి వారి మధ్య ఆ బాండ కనిపిస్తుంటుంది.
అయితే టాలీవుడ్ నుంచి యంగ్ టైగర్ ఎన్టీఆర్- విరాట్ కోహ్లీ చాలా ఫ్రెండ్స్ అన్న విషయం చాలా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.ఈ విషయాన్ని స్వయంగా విరాట్ కోహ్లీనే చెప్పాడు. తెలుగు హీరోల్లో తనకు ఎన్టీఆర్ మంచి ఫ్రెండ్ అని, యాక్టర్ గా అతన్ని ఎక్కువగా అభిమానిస్తానని విరాట్ చెప్పుకొచ్చాడు. కొన్నేళ్ల కిందట ఓ యాడ్ సమయంలో ఎన్టీఆర్ ను చూసినట్లు కోహ్లీ తెలిపాడు.
ఎన్టీఆర్ వ్యక్తిత్వానికి, ఆప్యాయంగా మాట్లాడే తీరుకు తను ఫిదా అయినట్లు కోహ్లీ చెప్పాడు. ఆర్ఆర్ఆర్ లో నాటు నాటు పాటకు అనుష్కతో కలిసి ఎన్నోసార్లు రీల్స్ చేశానని, గతేడాది ఓ మ్యాచ్ ఆడే టైమ్ లో ఆ పాటకు ఆస్కార్ వచ్చినట్లు తెలిసి వెంటనే గ్రౌండ్ లో ఆ పాటకు డ్యాన్స్ చేసి తన సంతోషాన్ని వ్యక్త పరిచినట్లు చెప్పాడు. ప్రత్యేక సందర్భాలేమైనా ఉంటే ఎన్టీఆర్ కు వీడియో కాల్ చేసి మాట్లాడుతుంటా అని విరాట్ తెలిపాడు. ఈ విషయాన్ని తెలుసుకున్న వారంతా కోహ్లీ-ఎన్టీఆర్ ఇంత క్లోజా అని ఆశ్చర్యపోతున్నారు.













